Asianet News TeluguAsianet News Telugu

ముషంపల్లి ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ.. మంత్రి జగదీష్ రెడ్డి

గురువారం ఉదయం జిల్లా కేంద్రప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఆయన మృతురాలి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతురాలికుటుంబ సభ్యులను మంత్రి జగదీష్ రెడ్డి పరమార్శించారు.

Mushampally incident will be heard by fast track court, Minister Jagadish Reddy
Author
Hyderabad, First Published Sep 23, 2021, 3:10 PM IST

నల్లగొండ జిల్లా నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని ముషంపల్లి (Mushampally)ఘటన అమానుషం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Jagadish Reddy) పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

గురువారం ఉదయం జిల్లా కేంద్రప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఆయన మృతురాలి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతురాలికుటుంబ సభ్యులను మంత్రి జగదీష్ రెడ్డి పరమార్శించారు.

Mushampally incident will be heard by fast track court, Minister Jagadish Reddy

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముషంపల్లి ఘటన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుగుతుందని ఆయన వెల్లడించారు. దుండగులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ తరహా ఘటనలపై ప్రజల్లో స్పందన రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

ముషంపల్లి ఘటనపై  గ్రామ ప్రజల స్పందన ఇతరులకు మార్గదర్శనం కావాలని ఆయన విజ్ణప్తి చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి వెంట నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఉప్పల శ్రీనివాస్,నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి,మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరి భార్గవ్ డి ఐ జి ఏ వి రంగనాధ్ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ: ఇంట్లోకి లాక్కెళ్లి, పట్టపగలు మహిళపై గ్యాంగ్ రేప్, ఆ తర్వాత హత్య

కాగా, నల్లగొండ జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామంలో పట్టపగలు అత్యంత ఘోరమైన సంఘటన జరిగింది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న 54 ఏళ్ల వయస్సు గల మహిళను ఇద్దరు వ్యవసాయ కూలీలు ఇంట్లోకి లాక్కెళ్లి, వివస్త్రను చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. 

నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను అదే గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య, పుల్లయ్యలుగా గుర్తించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో రోడ్డు వెళ్తున్న మహిళను ఇద్దరు నిందితులు ఇంట్లోకి లాక్కెళ్లి  దారుణానికి ఒడిగట్టినట్లు నల్లగొండ రూరల్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి చెప్పారు. మహిళపై అత్యాచారం చేసిన తర్వాత నిందితులు పారిపోయారు. 

పారిపోయే క్రమంలో వారికి మహిళ మరిది కనిపించాడు. ఆమె రోడ్డు మీద పడి ఉందని వారు అతనికి చెప్పారు. వారు చెప్పిన చోటికి అతను వెళ్లాడు. అయితే, వదిన కనిపించలేదు. దాంతో అతను లింగయ్య ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ ఆమెకు వదిన శవం కనిపించింది. తలపై, ఒంటిపై తీవ్రమైన గాయాలు అయినట్లు గుర్తించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios