Asianet News TeluguAsianet News Telugu

ఒంటరిగా ఉన్న పదమూడేళ్ల బాలికపై అత్యాచారం..

ఒంటరిగా ఉన్న బాలికను ఆ యువకుడు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పనికి వెళ్లి వచ్చిన అమ్మమ్మకు బాధిత చిన్నారి విషయం చెప్పింది. బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు నిందితుని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అశ్వాపురం సీఐ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. 

Rape of a lonely thirteen year old girl in ashwapuram
Author
Hyderabad, First Published Jan 1, 2022, 9:04 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అశ్వాపురం : పదమూడేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన సదరు బాలిక అమ్మమ్మ ఇంటివద్ద ఉంటోంది. ఆ పక్క ఇంట్లోనే జె. సాంబశివరావు (26) ఉంటున్నాడు. 

శుక్రవారం ఒంటరిగా ఉన్న బాలికను ఆ యువకుడు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పనికి వెళ్లి వచ్చిన అమ్మమ్మకు బాధిత చిన్నారి విషయం చెప్పింది. బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు నిందితుని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అశ్వాపురం సీఐ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. 

కాగా, కుమార్తెపై (15) అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రికి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక Pocso Court తీర్పునిచ్చింది. నిజామాబాద్ జిల్లామోర్తాడ్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తాగిన మైకంలో కుమార్తె మీద molestationకి పాల్పడ్డాడు. 

ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆమె pregnant దాల్చడంతో ఆర్మూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యురాలి సహాయంతో ఏడు నెలల పిండం తొలగించాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో, 2014 జులై 9న మోర్తాడ్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్లం కింద కేసులు నమోదు చేశారు. గర్భస్రావానికి సహకరించిన వైద్యురాలి పేరునూ కేసులో చేర్చారు. 

కొంతకాలానికి ఆమె covid 19 సోకి మరణించారు. పోలీసుల తరఫున జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్ వాదించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి పంచాక్షరి నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష రూ.5వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లిచకుంటే మరో ఆరునెలల జైలుశిక్ష అనుభవించాలన్నారు. బాధితురాలు న్యాయసేవా సంస్థను ఆశ్రయించి రూ.4 లక్షల పరిహారం పొందాలని తీర్పులో పేర్కొన్నారు. 

కుమార్తెపై అత్యాచారం.. గర్భందాల్చడంతో అబార్షన్.. తండ్రికి 20 యేళ్ల జైలు శిక్ష...

ఇదిలా ఉండగా, విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే దారి తప్పాడు. విద్యార్థినిపై Sexual assaultకి పాల్పడ్డాడు. మాజీ ప్రధానోపాధ్యాయురాలి జోక్యంతో చివరకు ఏడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం విశ్వసనీయ సమాచారం ప్రకారం… Shamirpet మండల  కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని (15)  తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ నెల 22న యధావిధిగా schoolకి వెళ్ళింది. mask పెట్టుకోలేదనే కారణంతో తన గదిలోకి రావాల్సిందిగా విద్యార్థిని Headmaster ఆదేశించాడు.

ఏమంటాడో, ఏం పనిష్మెంట్ ఇస్తాడో నని భయం భయంగా వెళ్లిన విద్యార్థిని మీద ఆ కీచక ప్రధానోపాధ్యాయుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తరువాత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీంతో బాలిక బాగా భయపడి తల్లితో సహా ఎవరికీ ఈ విషయాన్ని చెప్పలేదు.

అదే పాఠశాలలో గతంలో పనిచేసిన ప్రధానోపాధ్యాయురాలు బుధవారం అనుకోకుండా కలిసింది. ఆమె విద్యార్థిని కాస్త డల్ గా ఉండడం చూసింది. విద్యార్థిని కూడా ఆ ప్రధానోపాధ్యాయురాలితో ఉన్న చనువు కారణంగా.. బాలిక జరిగిన దారుణాన్ని ఆమె చెప్పింది. తల్లికి విషయం చెప్పి, ధైర్యం చెప్పడంతో బాలిక, ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించారు. అయితే విషయం బయటికి పొక్కడంతో.. ఓ పార్టీ నేతలు ప్రధానోపాధ్యాయుడికి మద్దతుగా రంగంలోకి దిగారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామంటూ రాజీకి ప్రయత్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios