ఎంసెట్ రద్దు యోచనలో తెలంగాణ సర్కార్ ఇంజనీరింగ్ సీట్లు భారీగా మిలగడటమే కారణం కార్పొరేట్ కాలేజీలకు ఇక కష్టకాలమే

పరీక్ష ఏదైనా ర్యాంకులన్నీ మావే అంటూ డబ్బా కొట్టుకొనే కార్పొరేట్ కాలేజీలకు కష్టకాలం మొదలైంది.పిల్లలను ర్యాంకుల కోసం కష్టపెట్టి, తల్లిదండ్రుల జేబులు గుల్ల చేసి ‘చైనా’ కళాశాలలకు ఇక కాలం చెల్లనుంది.

తెలుగు రాష్ట్రాలలో ఇంజినీరింగ్ సీటు ఒక హాట్ కేక్...దీనిలో భాగంగా ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించి పేరున్న కాలేజ్ లో ఇంజినీరింగ్ చేయాలనేది చాలా మంది విద్యార్థుల కల.

ఈ కల ను తెలుగు రాష్ట్రాలలో ఉన్న రెండు కార్పొరేట్ కాలేజీలు బాగానే క్యాష్ చేసుకున్నాయి. ఇటీవల ఆ రెండు కాలేజీ యాజమాన్యాలు కలిసి వాటి పేర్లు స్ఫురించేలా ముద్దుగా చైనా అనే కొత్త పేరు కూడా పెట్టకున్నాయి. ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లదండ్రులను ఇక కలిసి దోచుకోవడానికి రెఢీ అయ్యాయి.

అయితే గత కొన్నాళ్లుగా ప్రభుత్వాలు ఇంజినీరింగ్ కళాశాలలకు విచ్చలవిడిగా అనుమతిలివ్వడంతో కళాశాలల సంఖ్య భారీగా పెరిగింది.

హైదరాబాద్ లోనైతే చేరే విద్యార్థుల సంఖ్య కంటే ఇంజనీరింగ్ సీట్లు భారీగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి దాదాపు 500 వరకు ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఇందులో కొన్ని కాలేజీలు విద్యార్థులు చేరకపోవడంతో మూసివేడయం కూడ జరిగింది.

దీంతో ఎంసెట్ నిర్వహణ అవసరమా అన్న ఆలోచనలు మొదలయ్యాయి. ఇప్పటికే మెడికల్, డెంటల్ కోర్సులు జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష ‘నీట్’ పరిధిలోకి వెళ్లిపోయాయి. దీంతో మిగిలిన అగ్రికల్చర్, ఆయుష్ తదితర కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి.. ఇంజనీరింగ్ ప్రవేశాలను మాత్రం నేరుగా జేఈఈ మెయిన్ ర్యాంకులతోనో, ఇంటర్ మెరిట్‌తోనో చేపట్టాలని తెలంగా సర్కార్ భావిస్తోంది.


ఈ ఏడాది 1,43,820 సీట్లు ఉంటే.. 80 వేల సీట్లు కూడా నిండలేదు. దాదాపు సగం సీట్లు మిగిలిపోయాయి.

ఈ నేపథ్యంలో ఎంసెట్ రద్దుపై త్వరలోనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలిసింది.