డీఎస్సీకి ‘పక్ష’పాతం..అభ్యర్థులకు అశనిపాతం

Telangana students aghast at ministers emmpty statement about teacher posts
Highlights

మే 3 న విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి 15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు.

తెలంగాణలో డీఎస్సీ ప్రకటన ఓ జోక్ లా తయారైంది. ఇదుగో డీఎస్సీ... అదిగో డీఎస్సీ అంటూ రోజుకో ప్రకటన మంత్రుల నుంచి వెలువడుతూనే ఉంటుంది. నోటిఫికేషన్ మాత్రం రాదు.

 

మూడేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అధికార పార్టీ నేతలు ఇప్పటి వరకు 200 కంటే ఎక్కువ సార్లే డీఎస్సీ మంత్రం జపించారు.

 

మే 3 న విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి 15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు.

 

ఎంపీ బాల్క్ సుమన్ తో భేటీ అనంతరం ఆయన అభ్యర్థులకు అభయమిచ్చేలా ఇలా కచ్చితమైన డేట్ లైన్ తో ప్రకటన చేశారు.

 

దీంతో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ ప్రకటనను కాస్త సీరియస్ గానే తీసుకున్నారు.

 

టెట్ పరీక్ష నిర్వహణ తదితర టెక్నికల్ అంశాలను కూడా పక్కన బెట్టి మంత్రి ప్రకటనతో ఉత్సాహంగా పుస్తకాల దమ్ము మరోసారి దులిపారు.

 

అయితే మంత్రి ప్రకటన చేసి నేటితో  15 రోజుల దాటింది. మంత్రి గారు ప్రకటించిన డీఎస్సీ ప్రకటన మాత్రం షరా మామూలే.

 

మాట చెప్పిన మంత్రి, ఆయన వెంటే ఆ రోజు ఉన్న ఎంపీ ఇద్దరూ ఇప్పుడు పత్తా లేకుండా పోయారు.

 

దీంతో రగిలిపోతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఇలా ఓ ప్రకటననను సోషల్ మీడియాలో వదిలి తమ ఆవేదనను వెల్లగగ్గుతున్నారు.

 

కనీసం ఈ ఫోటో మంత్రి వరకు చేరితేనైనా ఆయన నుంచి మళ్లీ ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుందని అభ్యర్థులు ఆశపడుతున్నారు.

loader