Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల నగారా: ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లు సహా ఐదు మున్సిపాలిటీలషెడ్యూల్ విడుదల

ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లతో పాటు  ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణకు సంబందించి రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నాడు షెడ్యూల్ ను విడుదల చేసింది.

Telangana state Election commission issues schedule for  Khammam, warangal corporations and five municipalities lns
Author
Hyderabad, First Published Apr 15, 2021, 1:02 PM IST

హైదరాబాద్: ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లతో పాటు  ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణకు సంబందించి రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నాడు షెడ్యూల్ ను విడుదల చేసింది.ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ల పాలకవర్గం కాలపరిమితి ముగిసింది. దీంతో  కొత్త పాలకవర్గం కోసం ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట నకిరేకల్ మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఖాళీగా ఉన్న ఒక్క వార్డుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 16 వతేదీ నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు నామినేషన్ల స్వీకరణకు 18వ తేదీ వరకు గడువు విధించారు. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. మే 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. 

వరంగల్ లో 66, ఖమ్మం 60 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ముద్రణతో పాటు వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను కూడ పూర్తి చేశారు. గతంలో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించిన సమయంలో ఈ  పాలకవర్గాల పదవీకాాలం ముగియని కారణంగా ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios