త్వరలోనే పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు సిద్ధం అయ్యింది. ఇప్పటికే పరీక్ష పేపర్ల మూల్యాంఖనం పూర్తయ్యింది. ఈ వారంలోపై ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు త‌మ ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ శుభ‌వార్త చెప్ప‌నున్నాయి. అతి త్వ‌ర‌లోనే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఈ వారంలో ఫ‌లితాలు రావొచ్చ‌ని అధికారులు భావిస్తున్నారు. అయితే TS SSC ఫలితాల తేదీపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ఫ‌లితాల విష‌యంలో తాజా స‌మాచారం కోసం స్టూడెంట్లు తెలంగాణ బోర్డు అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.inని త‌నిఖీ చేస్తూ ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు. 

పచ్చదనంతో శోభాయమానంగా నల్లమల అందాలు.. గ‌ర్వ‌ప‌డాలి : ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్‌

ఈ ఏడాది తెలంగాణ బోర్డు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఇటీవ‌లే ఆ పరీక్ష పేప‌ర్ల మూల్యాంక‌న ప్ర‌క్రియ మొత్తం పూర్తి అయ్యింది. ఫ‌లితాలు విడుద‌ల చేసేందుకు ఇప్పుడంతా సిద్ధం అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఏడాది తెలంగాణ SSC బోర్డు మే 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఆఫ్ లైన్ లో నిర్వ‌హించింది. క‌రోనా వ‌ల్ల రెండేళ్ల త‌రువాత ఇలా ఆఫ్ లైన్ లో ప‌రీక్ష‌లు చేప‌ట్టింది. 

TS SSC 2022 ఫలితాలను విడుదల అయిన వెంట‌నే స్టేట్ బోర్డు మెమోను కూడా విడుదల చేస్తుంది. ప‌దో త‌ర‌గ‌తి ఫలితాల్లో విద్యార్థులు పాస్ అయ్యేందుకు ప్ర‌తీ స‌బ్జెక్ట్ లో 35 మార్కులు సాధించాల్సి ఉంటుంది. గ‌త రెండేళ్లుగా దేశ వ్యాప్తంగా నెల‌కొన్ని కోవిడ్ -19 పరిస్థితుల కార‌ణంగా తెలంగాణ‌లో కూడా బోర్డు పరీక్ష‌లు ర‌ద్దు చేశారు. అయితే ఆ ఏడాదిలో విద్యార్థులు సాధించిన ఇంట‌ర్న‌ల్ మార్కుల ఆధారంగా వారికి మెమోల‌ను అందించింది. 

సికింద్రాబాద్ విధ్వంసం కేసులో పోలీసులు అదుపులో మరో ఏడుగురు..!

ఫ‌లితాలు విడుద‌ల అయిన వెంట‌నే విద్యార్థులు త‌మ హాల్ టికెట్ నెంబ‌ర్ ను ఉప‌యోగించి సుల‌భంగా చెక్ చేసుకోవ‌చ్చ‌ని తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు తెలిపింది. అధికారికి వెబ్ సైట్ లో వ‌చ్చిన ఫ‌లితాల‌నే ప్ర‌మాణికంగా తీసుకోవాల‌ని పేర్కొంది. కాగా గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు మెరుగుప‌డుతూ వ‌స్తోంది. 2017లో ఈ ఉత్తీర్ణ‌త‌ శాతం 83.78 శాతం రాగా, 2018 సంవ‌త్సంలో 92.43 శాతం వ‌చ్చింది. అయితే ఈ ఏడాది కూడా ఉత్తీర్ణ‌త శాతం 92 శాతం కంటే ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.