హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని ఐటీ డిపార్ట్‌మెంట్ లో పనిచేసే మహిళా ఉద్యోగికి కరోనా సోకింది. కరోనా వైరస్ సోకిన మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

గత ఐదు రోజులుగా ఆమె కార్యాలయానికి రావడం లేదు. ఐటీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని నేచర్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఐటీ ఉద్యోగికి కరోనా సోకిన విషయం నిర్ధారణ కావడంతో సోమవారం నాడు కార్యాలయాన్ని శానిటేషన్ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. సచివాలయంలోని రెండో ఫ్లోర్ లో ఉన్న ఐటీ కార్యాలయంతో పాటు ఇతర ప్రాంతాలను కూడ శానిటేషన్ చేయనున్నారు.

also read:తెలంగాణలో కరోనా విస్ఫోటనం: రికార్డు స్థాయిలో 253 కేసులు, 8 మంది మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. శనివారం నాడు ఒక్కరోజున రికార్డు స్థాయిలో 253 కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 4737కి చేరుకొన్నాయి.

శనివారం నాడు ఒక్క రోజునే 8 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనాతో 182 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల సంఖ్య అధిక సంఖ్యలో పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ  పరిధిలోనే ఎక్కువగా ఉంటున్నాయి.

దీంతో జీహెచ్ఎంసీలో కరోనా కేసులను అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ఇటీవలనే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బృందం జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షలు నిర్వహించారు.