అది తెలంగాణ సచివాలయం. సచివాలయం అంటే రాష్ట్రం మొత్తానికి పరిపాలనా కేంద్రం. అక్కడినుంచే చట్టాలన్నీ అమలులోకి వస్తాయి. మరి అటువంటి సచివాలయం అనగానే ఫుల్ సెక్యూరిటీ జోన్ లో ఉంటదని తెలుసు కదా? కానీ సచివాలయం కాస్త ఇప్పుడు సెక్యూరిటీ జోన్ లో కాకుండా డేంజర్ జోన్ లో ఉన్నది. అదెట్లాగంటే చదవండి. వీడియో చూడండి.

సెక్రెటరేట్ ముందు ఓ వాహనదారుడు అదుపు తప్పి గుంతలో పడ్డాడు. భూగర్భ డ్రైనేజి కోసం గుంతలు తొవ్వుతున్న అధికారులు.. ఆ గుంతను అలాగే నిర్లక్షంగా వదిలివేశారు. దీంతో అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు బండి తో సహా అందులో పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు గుర్తించి ఆయన్ని రక్షించి హాస్పిటల్ కు తరలించారు.

అయితే ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరిగింది. బాధితుడిని రక్షించే వీడియో తాజాగా సోషల్ మీడియాకు ఎక్కడంతో వైరల్ అవుతోంది. మీరూ చూడండి. సచివాలయం ముందు గుంత.. పడిపోయిన బాధితుడి వీడియోను.