తెలంగాణ సాహిత్య సంపద భావి తరాలకు తెలియాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ సాహిత్య అకాడమి నడుం బిగించింది. దీనిలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధక విద్యార్ధులకు తెలంగాణ గ్రంథ సూచి బాధ్యతను అప్పగించింది.

దీనిలో భాగంగా వారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తిరిగి... అనేక సాహిత్య గ్రంథాల వివరాలను సేకరించారు. ఎంతోమంది రచయితలు తమ పుస్తక వివరాలను వీరికి అందించారు. అయితే ఈ పుస్తకం మరింత సమగ్రంగా ఉండాలంటే రచయితలు తమంత తాముగా స్పందించి రచనల వివరాలను తమకు అందించాల్సిందిగా విద్యార్ధులు కోరారు.

‘‘తెలంగాణ సాహిత్య గ్రంథ సూచి’’లో కవులు, రచయితలు తమ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా పుస్తక సంపాదకులు కోరారు. 9494715445 , 8184859060, 9963815484, 9247335278 నెంబర్లలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు.