హైదరాబాద్ శివారు ప్రాంతాలకు సబర్బన్,  బస్సులను తెలంగాణ ఆర్టీసీ బుధవారం నాడు ప్రారంభించింది. సుమారు 200 బస్సులు ఇవాళ నడుస్తున్నాయి. సిటీ బస్సులపై కూడ రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

ఈ ఏడాది మార్చి 22వ తేదీన తెలంగాణ ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది మే 19వ తేదీన  జిల్లాలకు ఆర్టీసీ బస్సులను ప్రారంభించింది ఆర్టీసీ.

జీహెచ్ఎంసీలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున సీటీ బస్సులను నిలిపివేశారు. హైద్రాబాద్ లో మెట్రో రైళ్లను ఈ నెలలో ప్రారంభించారు.ఇవాళ హైద్రాబాద్ శివారు ప్రాంతాలకు సబర్బన్, మఫిషిల్ బస్సు సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించింది.  సిటీ బస్సులను త్వరలోనే  ప్రారంభించే అవకాశం ఉంది.

also read:కొనసాగుతున్న ప్రతిష్టంభన: ఏపీ,తెలంగాణ ఆర్టీసీ ఎండీల భేటీ, అంతరాష్ట్ర సర్వీసులపై తేల్చేనా?

రెండు మూడు రోజుల్లోనే సిటీ బస్సులను ప్రారంభించే విషయమై నిర్ణయం తీసుకోనుంది. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు సిద్దంగా ఉండాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలను జారీ చేసింది.

ఏపీ రాష్ట్రంలో సిటీ బస్సులను ఆర్టీసీ ప్రారంభించింది. తెలంగాణలోని హైద్రాబాద్ లో కూడ రెండు మూడు రోజుల్లో కూడ సిటీ బస్సులను ప్రారంభించే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.