హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాాణ రాష్ట్రాల మధ్య  ఆర్టీసీ బస్సుల రాకపోకలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు మరోసారి రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు చర్చిస్తున్నారు. హైద్రాబాద్ ఆర్ అండ్ బీ కార్యాలయంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఏపీఎస్ఆర్‌టీసీ ఎండీ కృష్ణబాబులు మంగళవారం నాడు సమావేశమయ్యారు.

లాక్ డౌన్ ఆంక్షల సడలింపులో భాగంగా అంతరాష్ట్ర రాకపోకలకు కేంద్రం అనుమతిచ్చింది. కానీ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ రాకపోకలు నడవడం లేదు.  

రెండు రాష్ట్రాల మధ్య బస్సుల సర్వీసులను నడిపే విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయమై రెండు రాష్ట్రాల అధికారులు పలుమార్లు చర్చించారు. కానీ ఏకాభిప్రాయం మాత్రం కుదరలేదు. దీంతో ఆర్టీసీ ఎండీలు ఇవాళ సమావేశమయ్యారు.

also read:ఏపీ, తెలంగాణల మధ్య కుదరని సయోధ్య: కదలని ఆర్టీసీ బస్సులు

2014-19 మధ్య కాలంలో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ముగిసింది. దీంతో కొత్తగా అగ్రిమెంట్ చేసుకొందామని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఒప్పందం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.

తమకు నష్టాలు ఎక్కువగా వస్తున్నందున 1.52 లక్షల కి.మీ మాత్రమే బస్సులను నడుపుతామని ఏపీకి తెలంగాణ ప్రభుత్వం తెగేసీ చెప్పింది.  ఏపీ ప్రభుత్వం తాము తెలంగాణలో 2.10 లక్షల కి.మీ నడుపుతామని చెప్పింది. ఈ ప్రతిపాదనకు తెలంగాణ అంగీకరించడం లేదు. కొత్తగా ఒప్పందం చేసుకొందామని ఏపీకి తెలంగాణ ప్రతిపాదిస్తోంది.

ఏపీలో లక్షా 52 వేల కి.మీ. వరకు తెలంగాణ ఆర్టీసీ సర్వీసులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ ప్రతిపాదిస్తోంది. తెలంగాణలో లక్షా 10 వేల కిలోమీటర్ల సర్వీసులు తగ్గించుకోవాలని ప్రతిపాదిస్తోంది. 

ఏపీఎస్ఆర్టీసీ 55 వేల కి.మీ తగ్గించుకొని టీఎస్ఆర్టీసీ 55 వేల కి.మీ. పెంచుకొంటే సరిపోతోందని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రతిపాదిస్తున్నారు.  ఇదే విషయమై రెండు రాష్ట్రాల ఎండీల మధ్య చర్చించనున్నారు.