Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్: ఒక్క రోజులోనే 20 మంది మృతి, 6 వేలు దాటిన కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది.  
 

Telangana reports 6542 new corona cases, total rises to 3,67,901 lns
Author
Hyderabad, First Published Apr 21, 2021, 9:52 AM IST

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది.  గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 6,542 మందికి కరోనా సోకింది.  దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3,67,901కి చేరుకొంది. కరోనా నుండి 2,887 మంది కోలుకొన్నారు.  కరోనాతో 20 మంది మరణించినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.రాష్ట్రంలో 46,488 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1,30,105 మందికి పరీక్షలు నిర్వహించినట్టుగా వైద్య శాఖ తెలిపింది. ఇంకా 6,242 మంది పరీక్షల రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది.

గత 24 గంటల వ్యవధిలో ఆదిలాబాద్ లో98, భద్రాద్రి కొత్తగూడెంలో 128, జీహెచ్ఎంసీ పరిధిలో 898 జగిత్యాలలో230,జనగామలో 84, జయశంకర్ భూపాలపల్లిలో32, గద్వాలలో48, కామారెడ్డిలో 235, కరీంనగర్ లో 203,ఖమ్మంలో 246, మహబూబ్‌నగర్లో 263, ఆసిఫాబాద్ లో 37, మహబూబాబాద్ లో64, మంచిర్యాలలో 176,మెదక్ లో181 కేసులు నమోదయ్యాయి.

మల్కాజిగిరిలో570,ములుగులో42,నాగర్ కర్నూల్ లో 131,నల్గగొండలో285, నారాయణపేటలో37, నిర్మల్ లో 143, నిజామాబాద్ లో427,పెద్దపల్లిలో96,సిరిసిల్లలో124,రంగారెడ్డిలో532, సిద్దిపేటలో 147, సంగారెడ్డిలో320,సూర్యాపేటలో130, వికారాబాద్ లో 135, వనపర్తిలో81, వరంగల్ రూరల్ లో 85,వరంగల్ అర్బన్ 244, యాదాద్రి భువనగిరిలో 140 కేసులు నమోదద్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios