హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ లో సాధారణ వర్షపాతానికి కంటే అధికంగా 107.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏడాది సగటు కంటే ఇప్పటికే 50 శాతం అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ నుండి తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడ నమోదయ్యాయి. సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ రికార్డులు చెబుతున్నాయి.

తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్టుగా రికార్డులు చెబుతున్నాయి. నైరుతి రుతుపవనాలు వెళ్లిన తర్వాత  ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి.
ఈశాన్య రుతుపవనాలతో తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కానీ  అందుకు భిన్నంగా ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

also read:వరద నీటిలోనే మీర్‌పేటవాసుల నిరసన: సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం

అక్టోబర్ లో సాధారణంగా 77 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ప్రస్తుతం 153 మి.మీ. వర్షపాతం నమోదైంది. హైద్రాబాద్ లో 323 మి.మీ వర్షపాతం నమోదైంది.ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇప్పటివరకు కురవాల్సిన వర్షపాతం కంటే 15 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

హైద్రాబాద్ నగరంలో 117 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం నమోదైంది. 1903లో అక్టోబర్ మాసంలో  11.7 నమోదైన వర్షపాతం రికార్డును తిరగరాసింది. సుమారు 32 సెం.మీ వర్షపాతం నమోదైంది.