Asianet News TeluguAsianet News Telugu

Telangana rains : తెలంగాణను ముంచెత్తిన వర్షాలు.. మరో రెండు రోజులూ ఇదే పరిస్థితి..

Telangana Weather update : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

Telangana rains: Rains that flooded Telangana.. Same situation for next two days..ISR
Author
First Published Nov 29, 2023, 9:53 AM IST

Weather update : తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జల సంధి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనమే వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాకాలంలో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఉత్తరాఖండ్ టన్నెల్ నుండి బైటికొచ్చిన కార్మికులతో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

ఉత్తర తెలంగాణలో ఈ వర్షంతో పాటు పొగమంచు, చల్లగాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ముసురు లాంటి పరిస్థితి నెలకొంది. అయితే మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుందని, పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

Rahul Gandhi: ఒక వైపు పార్లమెంటు సమావేశాలు.. మరో వైపు విదేశాలకు రాహుల్ గాంధీ?

కాగా.. గడిచిన 24 గంటల్లో నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో వానలు కురిశాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలో ఉరుమలు, మెరపులతో వానలు పడ్డాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. తమిళనాడులో కూడా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దాని చుట్టుపక్కల ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో  అల్ప వాయు పీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం సోమవారం ప్రకటించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios