Rahul Gandhi: ఒక వైపు పార్లమెంటు సమావేశాలు.. మరో వైపు విదేశాలకు రాహుల్ గాంధీ?
రాహుల్ గాంధీ వచ్చే నెల 9వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నట్టు తెలుస్తున్నది. ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, వియత్నాం దేశాల్లో పర్యటించనున్నట్టు సమాచారం. మరో వైపు ఈ నెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ప్రచారాలు ముగిశాయి. నేటితో చిట్టచివరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికీ తెరపడింది. దీంతో జాతీయ పార్టీలు త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాలపైకి దృష్టి సారిస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లుతున్నట్టు సమాచారం అందింది.
డిసెంబర్ 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల కమిషనర్ నియామకం వంటి ముఖ్యమైన బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9వ తేదీన రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నట్టు రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందింది. ఆయన 9వ తేదీ నుంచి ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, వియత్నాం దేశాల్లో పర్యటించబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వివరించాయి.
Also Read: PM Modi: రేపు కేంద్ర మంత్రివర్గ సమావేశం.. ప్రధాని మోడీ నివాసంలో నిర్వహణ!
సింగపూర్, మలేషియాల్లో ఎన్ఆర్ఐలను, దౌత్యవేత్తలను రాహుల్ గాంధీ కలుసుకుంటారని తెలిపాయి. అలాగే, వియత్నాంలో కమ్యూనిస్టు నాయకులతోనూ సమావేశం అవుతారని తెలిసింది.