Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణకు భారీ వర్షసూచన: మూడు రోజుల పాటు వానలు, హైదరాబాద్‌లో కుంభవృష్టే

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

telangana rain alert for next 3 days ksp
Author
Hyderabad, First Published Jun 11, 2021, 5:55 PM IST

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం వల్ల వచ్చే 3 రోజుల్లో తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. 

Also Read:ఏపీ వాసులకు చల్లనికబురు.. నాలుగు రోజుల పాటు వర్షసూచన

మరోవైపు తెలంగాణ మీదుగా పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయిలో బలమైన గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల తో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 12, 13 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ సూచించింది

Follow Us:
Download App:
  • android
  • ios