Asianet News TeluguAsianet News Telugu

ఏపీ వాసులకు చల్లనికబురు.. నాలుగు రోజుల పాటు వర్షసూచన

మండుటెండలతో బెంబేలెత్తుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని ప్రకటించింది

imd alerts rain forecast in coming days across the andhra pradesh ksp
Author
Vijayawada, First Published Mar 31, 2021, 8:03 PM IST

మండుటెండలతో బెంబేలెత్తుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని ప్రకటించింది.

విశాఖ, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రాగల రెండు రోజుల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కనకబాబు తెలిపారు. ఏప్రిల్‌ 1 రాష్ట్రంలోని 113 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 217 మండలాల్లో వడగాల్పులు ఉంటాయని తెలిపారు.

అదే విధంగా ఏప్రిల్‌ 2వ తేదీన రాష్ట్రంలో 148 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 207 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. తీవ్రమైన వడగాల్పుల కారణంగా మహిళలు, పిల్లలు, వృద్దులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios