Asianet News TeluguAsianet News Telugu

గురుకుల పాఠశాలల్లో సైకాలజిస్టులను నియమించాలి.. మంత్రికి వినతిపత్రం...

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలలో సైకాలజిస్టులను నియమించాలని తెలంగాణ సైకాలజిస్టుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం సభ్యులు మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి వినతి పత్రం అందించారు. 

Telangana psychologists union meet minister koppula eswar - bsb
Author
Hyderabad, First Published Dec 24, 2020, 4:43 PM IST

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలలో సైకాలజిస్టులను నియమించాలని తెలంగాణ సైకాలజిస్టుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘం సభ్యులు మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి వినతి పత్రం అందించారు. 

తెలంగాణ సైకాలజిస్టుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.రాంచందర్ ఆధ్వర్యంలో సైకాలజిస్టులు ఎ.సుధాకర్, బి.అరుణ్ కుమార్, వై.శివరామప్రసాద్, దేదిప్యలు గురువారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ ను కలిశారు.ఈ సందర్భంగా వాళ్లు మంత్రికి వినతిపత్రమిచ్చారు. 

ఈ కాలంలో విద్యార్థులకు సైకాలజిస్టుల అండ ఎంతైనా అవసరమని తెలిపారు. విద్యార్థులు చదువు మీద మరింత శ్రద్ధ చూపేందుకు, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేందుకు, జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు గాను సైకాలజిస్టుల తోడ్పాటు అవసరమన్నారు. 

తమ విజ్ఞప్తిని వెంటనే పరిశీలించి సానుకూలమైన నిర్ణయం తీసుకోవలసిందిగా మంత్రిని కోరారు.సైకాలజిస్టుల సంఘం విజ్ఞప్తిని తప్పక పరిశీలిస్తానని మంత్రి వారికి హామీనిచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios