Telangana: తెలంగాణలో పాఠశాలల ఫీజుల పెంపు అంశంపై సమీక్షించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పలు సిఫార్సులు చేసింది. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అధికారాన్ని ఆయా పాఠశాలల ఫీజుల కమిటీలకే అప్పగించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సూచించినట్టు తెలిసింది.
Telangana: గత కొంత కాలంగా విద్యాసంస్థల ఫీజుల పెంపుపై తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాఠశాలల ఫీజుల పెంపునకు సంబంధించి విషయంపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఇక ప్రస్తుతం పలు కీలక నిర్ణయాలు వెల్లడించినట్టు సమాచారం. తెలంగాణలో పాఠశాలల ఫీజుల పెంపు అంశంపై సమీక్షించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పలు సిఫార్సులు చేసింది. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అధికారాన్ని ఆయా పాఠశాలల ఫీజుల కమిటీలకే అప్పగించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సూచించినట్టు తెలిసింది.ఏటా ఫీజుల పెంపుదల 10 శాతం లోపే ఉండాలని అభిప్రాయపడినట్టు తెలుస్తున్నది. అడ్మిషన్, ట్యూషన్ ఫీజులను తప్పనిసరి జాబితాలోనూ, ఇతర ఫీజులను ఆప్షనల్ జాబితాలోనూ చేర్చినట్టు సమాచారం.
తెలంగాణలో పాఠశాలల ఫీజుల పెంపు అంశంపై సమీక్షించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చేసిన పలు సిఫార్సులు గమనిస్తే.. తెలంగాణలోని పాఠశాలలు మునుపటి సంవత్సరంలో వసూలు చేసిన ఫీజులో 10 శాతానికి మించి ఫీజులను పెంచకూడదు. రాష్ట్రంలోని పాఠశాలలు కూడా ఫీజు నియంత్రణ కోసం ఫీజు కమిటీలను ఏర్పాటు చేయాలి. కమిటీకి మేనేజ్‌మెంట్ నుండి ఒక ప్రతినిధి నేతృత్వం వహించాలి.
10 మందితో పాఠశాల విద్యా కమిటీ
మొత్తం పది మంది సభ్యులతో పాఠశాల స్థాయి ఫీజుల కమిటీని ఏర్పాటుచేసుకోవాలి. కమిటీ చైర్మన్‌గా పాఠశాల యాజమాన్య ప్రతినిధి, కార్యదర్శిగా ప్రిన్సిపాల్ వ్యవహరిస్తారు. కమిటీలోని ఇతర సభ్యులు ఈ క్రింది విధంగా ఉండాలి..
- సెక్రటరీగా ప్రిన్సిపాల్
- ముగ్గురు ఉపాధ్యాయులు
- మాతృ-ఉపాధ్యాయ సంఘం నుండి ఐదుగురు తల్లిదండ్రులు
ఒకవేళ, పాఠశాల స్థాయి కమిటీ ఫీజును నిర్ణయించడంలో విఫలమైతే, విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఫీజు నియంత్రణ కమిటీకి సూచించాలి. అలాగే, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కనీసం మూడు నెలల ముందు పాఠశాలలు ఆడిట్ చేసిన ఖాతాలు మరియు కొత్త ఫీజు నిర్మాణ ప్రతిపాదనలను సమర్పించాలని కూడా సిఫార్సులు పేర్కొన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి..
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 2022-23 మరియు 2023-24 విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాలను ద్విభాషలో ముద్రించాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. అడ్మిషన్, ట్యూషన్ ఫీజులను తప్పనిసరి జాబితాలోనూ, ఇతర ఫీజులను ఆప్షనల్ జాబితాలోనూ చేర్చినట్టు సమాచారం. కాగా, ఈ నెల 2న హైదరాబాద్‌లో నిర్వహించిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో వివిధ అంశాలపై తీసుకొన్న నిర్ణయాల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.
హెచ్ఎస్‌పీఏ అసంతృప్తి.. !
హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌సీఎ) సంబంధిత ప్రతిపాదనతో సంతృప్తి చెందలేదనీ, ఇందులో చాలా లొసుగులు ఉన్నాయని పేర్కొంది. మౌలిక సదుపాయాలు మరియు అధ్యాపకుల ఆధారంగా పాఠశాలలను వర్గీకరించాలని HSPA కు చెందిన వెంకట సాయినాథ్ పేర్కొన్నారు. కేటగిరీ ఆధారంగా, సంవత్సరానికి గరిష్ట రుసుమును నిర్ణయించాలని ఆయన అన్నారు.
