ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో రోహింగ్యాలపై తెలంగాణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇదే సమయంలో వీరికి సహకరిస్తున్న ముస్లిం ఏజెంట్లపై ప్రత్యేక నిఘా ఉంచారు. అధికారిక లెక్కల ప్రకారం రాచకొండ, హైదరాబాద్ కమీషనరేట్ల పరిధిలో దాదాపు 4 వేల మంది రోహింగ్యాలు ఉన్నట్లు సమాచారం.

పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రోహింగ్యాల వద్ద ఆధార్ కార్డ్,ఓటర్ కార్డ్, డైవింగ్ లైసెన్సు, ఇండియన్ పాస్ పోర్ట్, రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు లభ్యమయ్యాయి. కొందరు ముస్లింలు ఇప్పటికే బ్యాంకు రుణాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సైతం అందుకున్నట్లుగా అధికారులు గుర్తించారు.

Also Read:Citizen Amendment Bill 2019 : పౌరసత్వ సవరణ బిల్లు వాస్తవాలివీ...

బాలాపూర్ క్రిసెంట్ స్కూల్ కరెస్పాండంట్ అబ్దుల్ కాలిక్యు తన స్కూల్ నుంచి స్కూల్ బోనోఫైడ్ ఇవ్వడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే రోహింగ్యాలకు భారత పౌరసత్వం పొందేందుకు అవసరమయ్యే  ధృవపత్రాలకు సహకరిస్తున్న ఏజెంట్లు మహ్మద్ ఫయాజ్, మహ్మద్ ఫైజల్, సయ్యద్ నయింలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

నగరంలో నిర్వహించే కార్డెన్ సెర్చ్‌‌లలో రోహింగ్యాల వివరాలు, ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమర్పించాలని సిబ్బందికి ఆదేశాలు అందాయి. అయితే కార్డెన్ సెర్చ్ సందర్భంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఓ ఎంఐఎం నేత అడ్డు తగిలారు.

Also Read:ఈ బర్మా రోహింగ్యా హైదరాబాద్ లో ఎంతపని చేశాడంటే....

గతంలో ఓ ప్రజా ప్రతినిధి కూడా 127 మంది ఆధార్ కార్డుల విషయంలో అడ్డుపడ్డ సంగతి తెలిసిందే. దీనిపై సీరియస్ అయిన పోలీసులు ఎంఐఎం నేతలు విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.