విశాఖకు చెందిన కెమికల్ ఇంజినీర్ మల్లిక్ అనే వ్యక్తికి తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గాజువాకలోని మల్లిక్ ఇంటికి వచ్చి నోటీసులు జారీ చేశారు సుల్తాన్ బజార్ పోలీసులు. కరోనా థర్డ్ వేవ్ అతి ప్రమాదకరమంటూ వ్యాఖ్యానించారని మల్లిక్‌పై ఆరోపణలు వున్నాయి. 

విశాఖకు చెందిన కెమికల్ ఇంజినీర్ మల్లిక్ అనే వ్యక్తికి తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గాజువాకలోని మల్లిక్ ఇంటికి వచ్చి నోటీసులు జారీ చేశారు సుల్తాన్ బజార్ పోలీసులు. కరోనా థర్డ్ వేవ్ అతి ప్రమాదకరమంటూ వ్యాఖ్యానించారని మల్లిక్‌పై ఆరోపణలు వున్నాయి. ఆయన మాటలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసే వున్నాయని కొన్ని రోజుల క్రితం సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలోనే మల్లిక్‌కు నోటీసులు ఇచ్చారు పోలీసులు.

ఈ నెల 5 లోపు సుల్తాన్ బజార్ పీఎస్‌లో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ క్రమంలో మల్లిక్ నిరసనకు దిగారు. తన వాట్సాప్ గ్రూప్‌ను అర్థాంతరంగా నిలిపివేశారంటూ విశాఖ జిల్లా గాజువాక ఆరూరి టవర్స్‌లో నిరాహార దీక్ష చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో వంటింటి వైద్యం ద్వారా ఎంతో మందికి ఆరోగ్య సూచనలు, సంప్రదాయ వైద్య పద్ధతులు తెలియజేస్తుంటే దానిని ఓర్వలేకే వాట్సాప్ గ్రూప్‌ను బ్లాక్ చేశారంటూ మల్లిక్ ఆరోపించారు.

Also Read:థర్డ్ వేవ్ పెద్ద ప్రమాదకారి కాదు.. ఐసీఎంఆర్

కరోనా బాధితులను రక్షిస్తున్నందుకు కొంతమంది కక్ష సాధిస్తున్నారని అన్నారు పరుచూరి మల్లిక్. కరోనా పేషెంట్లకు సేవ చేస్తున్న తనను, తన వాలంటీర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే తన వాట్సాప్ గ్రూప్‌ను పునరుద్దరించాలని కోరారు. ఇటీవల మల్లిక్‌పై హైదరాబాద్‌లో కేసు కూడా నమోదైంది. కరోనా థర్డ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా వుందని.. ప్రాణాలకు కూడా ముప్పు రావొచ్చని ఓ చానెల్‌లో మల్లిక్ మాట్లాడరంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనపై డిజార్డర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద కేసు పెట్టారు.