Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ మహానాడుకు విదేశీ మద్యం.. టీఎస్ పోలీసులు చేతిలో ఆధారాలు !

ఎవరో బ్రీఫారో తెలియదు కానీ, తెలుగు తమ్ముళ్లు మరోసారి తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయినట్లే అనిపిస్తోంది.

Telangana police have evidence  for the supply of scotch to vizag mahanadu

తెలుగు దేశం పార్టీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఆ పార్టీ ఏటా నిర్వహించే మహానాడు... అచ్చం తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు తమ్ముళ్లు మహానాడును నిర్వహిస్తుంటారని పేరుంది.  

 

తెలుగు రుచులు, తెలుగు వైభవం అక్కడ కన్నులకుకట్టేలా కనిపిస్తుందంటారు.

 

అయితే ఈ సారి టీడీపీ మహానాడుకు కాస్త భిన్నంగా జరుపుకోవాలని తెలుగు తమ్ముళ్లు భావించారని తెలుస్తోంది.

 

మే 27 నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో మహానాడు నిర్వహించనున్న విషయం తెలిసిందే.

 

దీని కోసం తెలుగు తమ్ముళ్లు విదేశీ మద్యం తెప్పించుకుంటున్నట్లు వార్తలుగుప్పుమంటున్నాయి.

 

నిన్న ఏయిర్ పోర్టులో పట్టుబడిన లిక్కర్ బాటిల్ దేశం తమ్ముళ్ల కోసమేనా అంటే అవుననే అనుమానం వస్తోంది.

 

గురువారం శంషాబాద్ ఏయిర్ పోర్టులో 226 విదేశీ మద్యం సీసాలను  తెలంగాణ రాష్ట్ర  ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

 

ఏయిర్ పోర్టులో పనిచేసే ఇద్దరు అధికారులే ఇందులో సూత్రదారులని పోలీసుల విచారణలోనూ తేలింది. దీంతో వారిని అదుపులోకి తీసుకొని లిక్కర్ బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను వెంటనే వదిలేయాలని ఏపీలోని విశాఖకు చెందిన ఓ మంత్రి తెలంగాణ ఏక్సైజ్ అండ్ ప్రొబిషన్ డైరెక్టర్ అకున్ సబర్వాల్

కు ఫోన్ చేసినట్లు తెలిసిందే.

 

అయితే విదేశీ మద్యం తెస్తున్నట్లు అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని.. వారిని వదిలేయడం కుదరదని అకున్ సబర్వాల్ స్పష్టం చేసినట్లు సమాచారం.

 

గత కొంత కాలంగా ఏయిర్ పోర్టులో ఈ విదేశీ మద్యం దందా జోరుగా సాగుతున్నట్లు ఆధారాలు లభించడంతో తెలంగాణ పోలీసులు పక్కా సమాచారంతోనే దాడులకు దిగారు.

పక్కా ఆధారాలతో నిందితులు పట్టుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios