Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్, కవితలకు పార్శిల్స్ పంపిన వ్యక్తి అరెస్ట్

 ఈ నెల 17వ తేదీన సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, వీఐపీలకు 62 కాటన్ బాక్స్ లను ఓ అజ్ఞాత వ్యక్తి  బుక్ చేశాడు.  ఈ  కాటన్ లలో ఉన్న బాటిల్స్ లో లిక్విడ్ ఉన్నట్టుగా  గుర్తించారు.. అంతేకాదు  ఈ బాటిల్స్ నుండి దుర్వాసన రావడాన్ని గమనించారు. 

telangana police arrested the one who send parcels to CM KCR and celebrities
Author
Hyderabad, First Published Aug 22, 2019, 10:18 AM IST

నాలుగు రోజుల క్రితం సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ కవిత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , పలువురు సినీ ప్రముఖులకు పార్శిల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత అవి రసాయనాలు అనుకొని పరీక్షలు చేయగా... మురుగు నీరు అని తేలింది. కాగా... ఈ పార్శిల్స్ పంపిన వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. 

నిందితుడు సికింద్రాబాద్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సీసీ కెమేరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడి తల్లిదండ్రులను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. 

ఇదిలా ఉండగా... ఈ నెల 17వ తేదీన సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, వీఐపీలకు 62 కాటన్ బాక్స్ లను ఓ అజ్ఞాత వ్యక్తి  బుక్ చేశాడు.  ఈ  కాటన్ లలో ఉన్న బాటిల్స్ లో లిక్విడ్ ఉన్నట్టుగా  గుర్తించారు.. అంతేకాదు  ఈ బాటిల్స్ నుండి దుర్వాసన రావడాన్ని గమనించారు.  ఈ విషయాన్ని గుర్తించిన సికింద్రాబాద్ పోస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ సమాచారం మేరకు పోలీసులు మంగళవారం సాయంత్రం ఈ బాటిల్స్ నుండి నమూనాలను సేకరించి ల్యాబ్ కు తరలించారు. ఈ బాటిల్స్ ఉన్న లిక్విడ్ ఏమిటనే విషయమై తేల్చేందుకు సిద్దమయ్యారు.

అయితే  ఈ బాటిల్స్ లో ఉన్న లిక్విడ్ మురుగు నీరు అంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాథమికంగా తేల్చింది. ఇంకా పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉంది.  ఓయూ లో మురుగరు నీరునే తాము తాగుతున్నామని వారు ఈ బాటిల్స్ నిండా నింపి పంపారు.ఈ బాటిల్స్ తో పాటు ఓ లేఖను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మురుగు నీరే తాము తాగుతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

బాటిల్స్ కలకలం: సీఎం కేసీఆర్ సహా పలువురికి పార్శిల్స్

కేసీఆర్ కు బాటిల్స్ పార్శిల్ కలకలం: తేలిందేమిటంటే..

Follow Us:
Download App:
  • android
  • ios