హైదరాబాద్:సికింద్రాబాద్ పోస్టాపీసుకు వచ్చిన  పార్శిల్ కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి , మంత్రులు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లతో  ఈ బాటిల్స్ వచ్చాయి.

విఐపీలకు బాటిల్స్  పార్శిల్ రావడంపై పోస్టల్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఈ బాటిల్స్‌లో ఏముందనే విషయమై తేల్చేందుకు ల్యాబ్ కు పంపారు.ఇంత పెద్ద ఎత్తున ఒకే సారి వీఐపీలకు పార్శిల్ రావడంపై పోలీసులు కూడ విచారణ చేస్తున్నారు.ఈ బాటిల్స్ ఎక్కడ నుండి వచ్చాయనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఈ బాటిల్స్ లో ఏమున్నాయనే విషయమై నిగ్గు తేల్చేందుకు ల్యాబ్ రిపోర్టు కోసం ఎదురు చేస్తున్నారు. ఆకతాయిలు చేసిన పనా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.