హైదరాబాద్: సీఎం కేసీఆర్ సహా మంత్రులు, వీఐపీలకు బాటిల్స్ లో మురుగు నీరు ఉందని ప్రాథమికంగా తేల్చారు. ఈ విషయమై ఇంకా పూర్తిస్థాయి నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.

ఈ నెల 17వ తేదీన సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, వీఐపీలకు 62 కాటన్ బాక్స్ లను ఓ అజ్ఞాత వ్యక్తి  బుక్ చేశాడు.  ఈ  కాటన్ లలో ఉన్న బాటిల్స్ లో లిక్విడ్ ఉన్నట్టుగా  గుర్తించారు.. అంతేకాదు  ఈ బాటిల్స్ నుండి దుర్వాసన వస్తోంది.  ఈ విషయాన్ని గుర్తించిన సికింద్రాబాద్ పోస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ సమాచారం మేరకు పోలీసులు మంగళవారం సాయంత్రం ఈ బాటిల్స్ నుండి నమూనాలను సేకరించి ల్యాబ్ కు తరలించారు. ఈ బాటిల్స్ ఉన్న లిక్విడ్ ఏమిటనే విషయమై తేల్చేందుకు సిద్దమయ్యారు.

అయితే  ఈ బాటిల్స్ లో ఉన్న లిక్విడ్ మురుగు నీరు అంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాథమికంగా తేల్చింది. ఇంకా పూర్తిస్థాయి నివేదిక రావాల్సి ఉంది.  ఓయూ లో మురుగరు నీరునే తాము తాగుతున్నామని వారు ఈ బాటిల్స్ నిండా నింపి పంపారు.

ఈ బాటిల్స్ తో పాటు ఓ లేఖను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. మురుగు నీరే తాము తాగుతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ లేఖ ఎవరు రాశారు....ఈ బాటిల్స్ ఎవరు పంపారనే  విషయమై పోలీసులు కూడ విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

బాటిల్స్ కలకలం: సీఎం కేసీఆర్ సహా పలువురికి పార్శిల్స్