సత్తు సింగ్ ను పట్టుకున్న పోలీసులు నానక్ రాం గూడ భవన యజమాని అతడే దుర్ఘటన జరగిన రోజే హైదరాబాద్ నుంచి పరారీ

అక్రమ కట్టడాలతో పేదల నిండు ప్రాణాలను బలిగొన్న సత్తు సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

శుక్రవారం రాత్రి హైదరాబాద్ నానక్ రాం గూడ లో ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు ఈ దుర్ఘటనలో చనిపోయినవారి సంఖ్య 11 కు చేరింది.

అయితే ఈ భవన యజమాని సత్తు సింగ్ భవనం కూలిన వెంటనే హైదరాబాద్ నుంచి పరారయ్యాడు.

దీంతో సత్తూసింగ్ ను పట్టుకునేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేశారు.

గతంలో సత్తూ సింగ్ పై కబ్జాలు, బెదిరింపులకు సంబంధించి పలు కేసులు వివిధ పోలీస్ స్టేషన్ లో నమోదై ఉన్నాయి.

కాగా, ఈ ఘటనలో భవన శిథిలాల తొలగింపు పూర్తయింది. అధికార యంత్రాంగం 28 గంటల పాటు నిర్విరామంగా పనిచేసింది. మొత్తం 11 మంది చనిపోగా ఇద్దరిని మాత్రమే రక్షించ గలిగారు.