టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు ఆర్ఎస్ ప్రవీణ్ దీక్ష: అరెస్ట్ చేసిన పోలీసులు
బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని ప్రవీణ్ కుమార్ దీక్షకు దిగాడు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
హైదరాబాద్: బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను శుక్రవారంనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు బీఎస్పీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేసి వదిలిపెట్టిన తర్వాత తన నివాసంలో దీక్షను చేస్తున్నట్టుగా ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.
ఈ నెల 12. 15.16 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది. ఈ నెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్షలను రద్దు చేసింది. ఈ ప్రశ్నాపత్రం లీక్ కేసులో పోలీసులు ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును విచారించేందుకు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ప్రశ్నాపత్రం లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు కీలకంగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును టెక్నికల్ ఆధారాలతో విచారణ చేయాలని భావిస్తున్నారు. ప్రవీణ్ ఫోన్ ను పోలీసులు ఎఫ్ఎస్ఎల్ కు పంపారు.