Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ పై రమ్యారావు మరోసారి ఫైర్

  • రాజకీయ వేధింపులు సహించేదిలేదు
  • శ్రీధర్ బాబుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసులు
  • టిఆర్ఎస్ లో అవినీతి నేతలపై కేసులు ఎందుకు లేవు?
telangana pcc leader ramya rao fire on kcr

సిఎం కేసిఆర్ మీద తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి (కేసిఆర్ అన్న కూతురు) రేగులపాటి రమ్యారావు ఫైర్ అయ్యారు. అవినీతి అక్రమాలు చేసిన వారు అధికార పార్టీలో దర్జాగా తిరుగుతన్నా వారిని ఏమనకుండా విపక్షాలపై కేసిఆర్ కక్ష తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. శ్రీధర్ బాబు పై కుట్ర కేసు టిఆర్ఎస్ సర్కారు రాజకీయ కక్ష సాధింపులో భాగమే అని విమర్శించారు. 

గాంధీభవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రమ్యారావు కేసిఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఆమె వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే...

టిఆర్ఎస్ నాయకులు శ్రీధర్ బాబు పై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

శ్రీధర్ బాబు కుటుంబం తరతరాలుగా ప్రజా సేవకు నిమగ్నమైన కుటుంబం.

కాళేశ్వరం ప్రాజెక్ట్ భూనిర్వాసితుల కోసం పోరాడుతున్నందుకే శ్రీధర్ బాబు పై కుట్ర కేసు పెట్టారు.

టిఆర్ఎస్ పార్టీ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, మంత్రులపై అవినీతి ఆరోపణలొచ్చాయి.

చివరకు శాసనసభ స్పీకర్ పైనా కూడా ఆరోపణలు ఉన్నాయి.. వాటిపై ఎందుకు కేసులు లేవు?

సీఎం కు చిత్తశుద్ధి ఉంటే ముందు స్వంత పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలి.

నయిమ్ కేసులో నిందితుడిగా ఉన్న నేతి విద్యాసాగర్ పైన ఎందుకు చర్యలు లేవు.

అక్రమ కట్టడాలు చేపట్టిన ఎమ్మెల్సీ భానుప్రసాద్ పైన ఎందుకు చర్యలు ఉండవు.

బెదిరింపులకు పాల్పడిన వేణుగోపాలా చారీ .. వేముల వీరేశం .. రసమయి బాలకిషన్ .. గాదరి కిషోర్ .. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.

సిరిసిల్ల ఇసుక మాఫియాపై ఎందుకు కేసులు పెట్టలేదు.

మంథని ఎమ్మెల్యే పుట్టా మధు పై వచ్చిన హత్య కేసు ఆరోపణలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.

ప్రజా సమస్యలపై పోరాడుతున్న కాంగ్రెస్ నాయకులపై రాజకీయకక్ష సాధిపు చర్యలకు దిగడం సరికాదు.

కేసీఆర్ ప్రజా స్వామ్య పాలనను రాచరికపు పాలనగా మార్చేస్తున్నారు.

శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నప్పుడు .. కేటిఆర్, హరీష్, బాల్క సుమన్,  భాను ప్రసాద్ లాంటి నేతలు వచ్చి పనులు చేయించుకోలేదా?

ఉద్యమ సమయంలో శ్రీధర్ బాబు ఎన్నడూ ఉద్యమకారులపై కేసులు పెట్టించలేదు.

కాంగ్రెస్ నాయకులపై కక్షసాధిపు కేసులు పెట్టడం మాకుకొకపోతే ఖబర్దార్

కాంగ్రెస్ శ్రేణులు సహించవు. మీ భరతం పడతాయి.

 

కాబోయే సిఎం రేవంత్ రెడ్డి... వీడియో కోసం,

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/8WE6wB

 

Follow Us:
Download App:
  • android
  • ios