తెలంగాణ సచివాలయ నిర్మాణానికి కేసీఆర్ సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. పాత సచివాలయం కూల్చివేత పనులు ఇప్పటికే మొదలయ్యాయి. వందేళ్ల పాటు పనిచేసేలా కొత్త సచివాలయానికి కేసీఆర్ రూపకల్పన చేస్తున్నారు.

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా భవన నిర్మాణం వుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డెక్కన్, కాకతీయ శైలిలో నూతన సచివాలయం ఉండనుంది. చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ పోన్ని.. ఈ సచివాలయ నమూనాను రూపొందించారు.

Also Read:సచివాలయంపై ఆ నిర్ణయాలు అవసరమా?: కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్

పూర్తి వాస్తుతో సచివాలయ భవనం ఉంటుంది. 25 ఎకరాల్లో, దీర్ఘ చతురాస్రాకారంలో, ఆరు అంతస్తుల భవనం ఉంటుంది. ఇందులో పూర్తి హైటెక్ హంగులు ఉంటాయి. సుమారు 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయ నిర్మాణం జరుగుతుంది.

ఏకకాలంలో 800 వాహనాల పార్కింగ్ చేసేలా నిర్మిస్తున్నారు. కొత్త సచివాలయంలో గుడి, బడి, బ్యాంక్, ఏటీఎం, క్యాంటీన్ వంటి సౌకర్యాలు ఉంటాయి. అంతేకాకుండా తక్కువ విద్యుత్‌ వినియోగం వుండేలా ప్లాన్ చేశారు.

Also Read:తెలంగాణ నూతన సచివాలయం... ఎలా వుండనుందంటే

వెయ్యి మంది కూర్చొనేలా కాన్ఫరెన్స్ హల్ ఉంటుంది. సచివాలయంలో ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా గదులుంటాయి. మంత్రుల పేషీలోనే ఆ శాఖ కార్యదర్శి పేషీ కూడా ఉంటుంది.