తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా ముగిసింది. కాంగ్రెస్ నేతలకు, ఎన్నికల అధికారి నాగి రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారి తీసింది. 

ఎన్నికల అధికారి నజియా రెడ్డి ఆదేశాలక మీద దళిత బహుజన పార్టీ అధ్యక్షుడిని ఆ రూమ్ నుండి బయటకు గెంటేశారు. ఆ తరువాత ఆయన నాంపల్లి పోలీస్ స్టేషన్ లో నాగి రెడ్డిపైన ఫిర్యాదు చేసారు. రానున్న మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని నిర్బవహించడం జరిగింది. 

వార్డులకు సంబంధించిన రేజర్వేషన్లు ఇంకా ఎందుకు ప్రకటించలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. జనవరి 8వ తేదీన నామినేషన్లు స్వీకరిస్తామని ప్రకటించినప్పటికీ రేజర్వేషన్లను ఇంకా ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదని వారు ప్రశ్నించారు. అధికార తెరాస, దాని మిత్రపక్షమైన ఎంఐఎం మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలూ నాగి రెడ్డి ని నిలదీశాయి. 

Also read: మున్సిపల్ ఎన్నికలు 2020: ఎవరి ధీమా వాళ్లదే

ఎన్నికల అధికారిని అడిగితే ఆయనేమి సమాధానం ఇవ్వట్లేదని, పత్రికల్లో చూస్తుంటేనేమో... 6వ తేదీన రేజర్వేషన్లు ప్రకటిస్తారని చెబుతున్నారని, ఇలా చేస్తే రెండు రోజుల గడువులో తాము ఎలా సిద్ధపడగలుగుతామని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. 

ఇలా కేవలం రెండు రోజుల ముందు రేజర్వేషన్లను ప్రకటిస్తే అధికార తెరాసకు వారికున్న అంగ బలం, అర్థ బలం దృష్ట్యా వారు సిద్ధం కాగలరని, విపక్షాలకు మాత్రం ఇది తీరని అన్యాయం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. 

Also read: మేం పవర్‌లోకి వస్తే.. నీకు తిప్పలే: ఎన్నికల కమీషనర్‌ నాగిరెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్

సంక్రాంతికి చాలామంది ప్రజలు సొంత ఊర్లకు వెళ్తారని...అలాంటప్పుడు ఇంత త్వరగా సంక్రాంతికి ముందు ఎందుకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు నాగి రెడ్డి ని ప్రశ్నించారు. నాగిరెడ్డి సమాధానాలతో సంతృప్తి చెందని నేతలు వాకౌట్ చేసారు.