Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: రెబెల్స్ కు కేటీఆర్ వార్నింగ్

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ అభ్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తే కఠీనమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Telangana Municipal elections: KTR warns TRS rebels
Author
Hyderabad, First Published Jan 16, 2020, 1:47 PM IST

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీకి దిగుతున్న పార్టీ రెబెల్స్ పై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తమ తమ నియోజకవర్గాల్లోని తిరుగుబాటు అభ్యర్థుల తీరుపై శాసనసభ్యులు కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం నిర్వహించాల్సిన తీరుపైన అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.    

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తే సరిపోతుందని ఆయన చెప్పారు.    గత ఆరు సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం అనుభవంలో ఉందని ఆయన అన్నారు.    పెన్షన్ ల నుంచి మొదలుకొని సాగునీటి ప్రాజెక్టుల దాకా కెసిఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, నూతన జిల్లాల వికేంద్రీకరణ  ఇలా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు. సుమారు 45 వేల కోట్ల రూపాయతో  సంక్షేమ కార్యక్రమాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన అన్నారు.    

Also Read: మల్లారెడ్డి బండారం బయటపెడ్తా: బజారుకెక్కిన మేడ్చల్ లొల్లి

పట్టణాల కోసం ఇప్పటికే మిషన్ భగీరథ లో భాగంగా బల్క్ వాటర్ సప్లై అందిస్తున్నామని, పట్టణాల్లోనూ మిషన్ భగీరథ అర్బన్ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయని,    పట్టణాలకు 3,75000 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశామని కేటీఆర్ చెప్పారు.పట్టణాలకు ప్రత్యేక నిధులు కార్పొరేషన్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు ఇస్తోందని, ఇప్పటికే టియూఎఫ్ఐడిసి ద్వారా పట్టణాల అభివృద్ధికి 25 వందల కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

స్వచ్,  హరిత పట్టణాల కోసం  చెత్త తరలింపు కోసం ఆటోలు, ఇతర వాహనాలను సమకూర్చారని, ప్రతి పట్టణానికి నర్సరీని ఏర్పాటు చేయడంతోపాటు హరితహారం పెద్ద ఎత్తున చేపడుతున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఖర్చు చేసిన నిధులను పోల్చుకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం పది రెట్లు పట్టణాల కోసం కేటాయించిందని చెప్పారు.    

కాంగ్రెస్ పార్టీ  పాలను టిఆర్ఎస్ పార్టీ పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయాలని ప్రజలను కోరాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ పట్టణాలు దేశంలోనే ఆదర్శ మున్సిపాలిటీలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. నూతన మునిసిపాలిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేసి ప్రజలకు మరింత పారదర్శక వేగవంతమైన పౌర సేవలను అందిస్తామని చెప్పారు.    

Also Read: 1100 వార్డుల్లో ఆపార్టీలకు అభ్యర్థుల్లేరు, 84 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం

కాంగ్రెస్ బిజెపి పార్టీలకు కొన్ని స్థానాల్లో కూడా అభ్యర్థుల్లో నీళ్లు లేని పరిస్థితుల్లో ఉన్న ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ విజయం  ఖాయం అయినట్టేనని, అయినా కూడా  ఎన్నికల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని అన్నారు.        

పార్టీ బి ఫారం కోసం ప్రయత్నం చేసిన తోటి నాయకులను కలుపుకుని సమిష్టిగా ఐక్యంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. పార్టీ అభ్యర్థులు ఈ నాలుగు రోజుల్లో కనీసం మూడు నుంచి ఐదు సార్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను మంచి సమాచారాన్ని అందించి ఓట్లు అడగాలని చెప్పారు.    

ప్రతి వార్డు అవసరాల మేరకు పట్టణాల అవసరాల మేరకు స్థానిక మేనిఫెస్టోను విడుదల చేయాలని, ఎన్నికలకు సంబంధించి నుంచి కేంద్ర పార్టీ కార్యాలయం ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటుందని చెప్పారు. ఫలితాల తర్వాత గెలిచిన అందరూ అభ్యర్థులతో మరోసారి సమావేశమవుతానని కేటీఆర్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios