హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని 130 మున్సిపాలిటీల్లోని 84  వార్డుల్లో 84మంది టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ప్రత్యర్థులు లేదా రెబెల్స్ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో  84 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 ఈనెల 22వ తేదీన రాష్ట్రంలోని మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి.ఈ నెల 25వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.ఎన్నికలకు ముందే 84 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు  ఏకగ్రీవంగా ఎన్నిక కావడం టీఆర్ఎస్‌కు మంచి శుభారంభాన్ని ఇచ్చింది. 

ఈ ఎన్నికల్లో విపక్షాలు తమ ఉనికిని చాటుకొనేందుకు పోటీ చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రంలోని ఏడు వందల వార్డులో కాంగ్రెస్ పార్టీ, 400 వార్డుల్లో బిజెపి పోటీ చేయడం లేదు.

Also read:నో టిక్కెట్టు: కన్నీళ్లు పెట్టుకొన్న మాజీ మున్సిపల్ ఛైర్మెన్, సూసైడ్ యత్నం

మున్సిపల్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ మరింత బలపడే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరణకు ఈ నెల 14వ తేదీతో ముగిసింది. 

Also read:బీ-ఫారం దక్కలేదని టీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం

రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తామని టీఆర్ఎస్ నాయకత్వం చెబుతుంది.