తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె శ్రీనిధిరెడ్డి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. కర్నూలు జిల్లా వైసీపీ నేత శిల్పామోహన్ రెడ్డి సోదరుడు శిల్పా ప్రతాప్ రెడ్డి కుమారుడికి ఆమెను ఇచ్చి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు.

కాగా కోమటిరెడ్డి బ్రదర్స్‌తో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి సోదరులు ఆయనతో సన్నిహితంగా మెలిగేవారు. అలా జగన్‌తో సైతం మంచి అనుబంధం ఏర్పడింది.