Asianet News TeluguAsianet News Telugu

UP +Yogi..upyogi కాదు.. యూస్ లెస్: బీజేపీపై నిప్పులు చేరిన అఖిలేష్ యాదవ్

up assembly elections 2022: ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌కీయాలు కాక‌పుట్టిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలోని రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత , రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్ర‌భుత్వాల‌పై ఘాటు విమర్శ‌ల‌తో రెచ్చిపోయారు. 
 

Akhilesh Yadav fires on bjp
Author
Hyderabad, First Published Dec 19, 2021, 3:37 PM IST

up assembly elections 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ త‌న ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా  UP +Yogi..upyogi అనే నినాదాన్ని తీసుకువ‌చ్చింది.  "యూపీ+యోగి" నినాదం పై రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్  యాద‌వ్ స్పందిస్తూ కేంద్ర‌, రాష్ట్ర బీజేపీ ప్ర‌భుత్వాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. UP +Yogi..upyogi కాదు యూస్ లెస్ అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అఖిలేశ్ యాదవ్ టార్గెట్ గా, ఆయన సన్నిహితులైన పార్టీ నేతల ఇళ్లలో శనివారం ఉదయం నుంచి ఐటీ  సోదాలు జరుగుతున్న సంగ‌తి తెలిసిందే.  ఎస్పీ కీలక నేత రాజీవ్ రాయ్, మనోజ్ యాదవ్ తోపాటు అఖిలేశ్ తో అనేక రకాల అనుంబంధం కలిగిన ఎస్పీ నేతలు పలువురి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులుజరిగాయి. ఈ నేప‌థ్యంలోనే అఖిలేష్ యాద‌వ్  ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు.

Also Read: engineering courses: తెలుగులోనూ ఇంజినీరింగ్ కోర్సులు చ‌ద‌వ‌చ్చు.. !

ఉత్త‌రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి అతిపెద్ద ఛాలెంజర్ గా స‌మాజ్‌వాదీ ఎదుగుతున్న తీరు రాష్ట్రంలో క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర సంస్థ‌ల‌ను ఉప‌యోగించుకుని త‌మ పార్టీ నేత‌ల‌ను బీజేపీ స‌ర్కారు బెదిరింపుల‌కు గురిచేస్తున్న‌ద‌ని అఖిలేష్ యాద‌వ్ అన్నారు.  అలాగే, త‌మ‌పై నిఘా పెట్టార‌నీ, త‌మ ఫోన్ల‌ను ట్యాప్ చేస్తున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మపై నిఘా పెట్టిన స‌ర్కారు.. తమ ఫోన్ల‌ను ట్యాప్ చేస్తున్నార‌నీ, ప్ర‌తి రోజు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్  రికార్డింగ్ ల‌ను వింటార‌ని అఖిలేష్ యాద‌వ్ ఆరోపించారు. రాష్ట్రంలోని రాజ‌కీయ నేత‌లే కాదు.. మీరు కూడా (జ‌ర్న‌లిస్టులు) ప్ర‌భుత్వ నిఘాలోనే ఉన్నార‌ని పాత్రికేయుల‌ను ఉద్దేశించి అన్నారు. త‌మ పార్టీ నేత‌ల‌పై దాడుకు పాల్ప‌డే విధంగా బీజేపీ త‌న అధికార దుర్వినియోగానికి పాల్ప‌డటం.. జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మికి సూచ‌న‌గా పేర్కొన్నారు. శ‌నివారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో UP +Yogi..upyogi అంటే ఉప‌యోగ‌క‌ర‌మైన‌ది అంటూ ప్రధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ UP +Yogi..upyogi కాదు.. "Unupyogi...": ప‌నికిరానిది (యూస్‌లెస్) అంటూ ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించారు.

Also Read: Rajnath Singh: జాతీయ భ‌ద్ర‌త‌కే తొలి ప్రాధాన్యం.. భార‌త్‌లోనే ఆయుధాల తయారీ..

ఈ యూస్‌లెస్ (Unupyogi...) ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప్ర‌యోజ‌నాలను ఆశిచంచ‌లేమ‌ని అఖిలేష్ యాద‌వ్ అన్నారు. "ఇప్ప‌టికీ  ఆదాయపు పన్ను శాఖ వ‌చ్చింది. ముందుముందు  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  వ‌స్తుంది. సీబీఐ కూడా వ‌స్తుంది. కానీ చ‌క్రం (సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల చిహ్నం) మాత్రం ఆగదు" అని ఆయన అన్నారు.  గత వారం చివరిలో పార్లమెంటులో గందరగోళాన్ని సృష్టించిన ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న గురించి మాట్లాడుతూ..  లఖింపూర్ ఖేరీ రైతు హత్యల‌కు కార‌ణ‌మైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా - అతని కుమారునిపై ఎందుకు అభియోగాలు మోపడం లేద‌ని ప్రశ్నించారు. ఈ కేసును పరిశీలిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇది "ప్రణాళికాబద్ధమైన కుట్ర" అని చెప్పిన తరువాత కూడా మంత్రిని ఎందుకు మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించ‌లేదు. అత‌ని రాజీనామాను ఎందుకు డిమాండ్ చేయ‌డం లేదు అని ప్ర‌శ్నించారు. 

Also Read: Priyanka Gandhi: ఏడేండ్లలో ఏం ఉద్దరించారు? : కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్

Follow Us:
Download App:
  • android
  • ios