నేడు మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గాంధీ చేసిన సేవలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కాగా... మహాత్మాగాంధీకి తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.

మహాత్మాగాంధీ నిరాడంబరంగా జీవించాడని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా గుర్తు చేశారు. సరళత, అహింస, భారతీయతకు ఉదాహరణగా ఇప్పటికీ మహాత్మాగాంధీ కొనసాగుతున్నారని కేటీఆర్ అన్నారు. 

 

హరీష్ రావు కూడా గాంధీకి నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీకి 150వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గాంధీ ఇచ్చిన సందేహాలను వచ్చే జనరేషన్ కూడా పాటించాలని ఆయన ఈ సందర్భంగా కోరుకున్నారు.