కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే మేం సిద్దం: అమిత్ షాకి తలసాని కౌంటర్


కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే తాము కూడా ఎన్నికలకు సిద్దమని తెలంగాణ  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన విమర్శలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటరిచ్చారు.

Telangana minister Talasani Srinivavas yadav Reacts On Union Minister Amit Shah Comments

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే తాము కూడా ఎన్నికలకు సిద్దమని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

ఈ నెల 14న కేంద్ర మంత్రి అమిత్ షా తుక్కుగూడలో తెలంగాణ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు తెలంగాణ మంత్రి Talasani Srinivas Yadav ఆదివారం నాడు కౌంటర్ ఇచ్చారు.

Hyderabad లోని సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని  బండ మైసమ్మ నగర్ లో రూ.27.50 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, Vemula Prashanth Reddyలు ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.

 ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం, ఎవరు విజయం సాధిస్తారో చూద్దామని తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు.కేంద్రంలో అధికారంలో ఉన్నామని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర మంత్రికి హితవు పలికారు.తమ వెంట వస్తే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపుతామన్నారు. Gujarat  రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్  ఇళ్లను ఎందుకు నిర్మించలేదో చెప్పాలని ఆయన కోరారు.పేదలకు స్వంత ఇళ్లు నిర్మించి ఇస్తున్న చరిత్ర కేసీఆర్‌దేనని ఆయన చెప్పారు.దేశ ప్రజల సంపదను ప్రధాని మోడీ అదానీ, అంబానీలకు దోచీ పెడుతున్నారని  తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.

also read:తెలంగాణలో అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్లు: కాంగ్రెస్ నేత పీజేఆర్‌పై బీజేపీ నేత బండి ప్రశంసలు

ముందస్తు ఎన్నికలకు వెళ్తే తాము కూడా సిద్ధంగా వున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న తుక్కుగూడలో  బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సభలో కేసీఆర్ పై అమిత్ షా విమర్శలు చేశారు.ఎంఐఎం, కేసీఆర్‌ను చూసి భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామని ప్రకటించిన కేసీఆర్ ఎంఐఎంకు భయపడి  భయపడి విమోచన దినాన్ని పక్కనబెట్టారని విమర్శించారు..

ఎంఐఎం , కేసీఆర్‌ని ఒకేసారి పంపించేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతామని ఆయన  హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో వుందన్నారు. ఇలాంటి ప్రభుత్వం మీకు అవసరమా అని అమిత్ షా ప్రశ్నించారు. ఆయుష్మాన్ భవను తెలంగాణలో అమలు చేయట్లేదన్నారు. సైన్స్ సిటీ కోసం భూమి ఇవ్వలేదని, వరంగల్‌లో సైనిక్ స్కూల్ కోసం భూమి కేటాయించలేదని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎనిమిదేళ్లలో కేంద్రం రూ.2 లక్షల కోట్లకు పైగా ఇచ్చిందని అమిత్ షా స్పష్టం చేశారు. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని... డబుల్ ఇంజిన్ సర్కార్‌తో తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చడానికి బండి సంజయ్ ఒక్కరు సరిపోతారని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సంజయ్ ప్రసంగం విన్న తర్వాత ఇక్కడికి తాను రావాల్సిన అవసరం లేదనిపిస్తోందన్నారు. తెలంగాణలో నిజాంను మార్చాలా ..? వద్దా ..? అని అమిత్ షా ఈ సందర్భంగా ప్రజలను ప్రశ్నించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios