బహిరంగంగా ఓ వ్య‌క్తిపై చేయిచేసుకున్న తెలంగాణ మంత్రి త‌ల‌సాని.. వీడియో వైర‌ల్

Hyderabad: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకుడు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బహిరంగంగా ఒక వ్య‌క్తిపై చేయిచేసుకున్నారు. హిమాయత్‌నగర్‌ ఆర్టీసీ క్రాస్రోడ్ వద్ద ఐకానిక్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు వైర‌ల్ గా మారాయి. దీంతో మంత్రి తీరుపై ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌గా, ప్ర‌జ‌లు మంత్రి పై మండిప‌డుతున్నారు. 
 

Telangana minister Talasani Srinivas Yadav slaps man in public; video goes viral RMA

Telangana minister Talasani  slaps man in public: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకుడు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బహిరంగంగా ఒక వ్య‌క్తిపై చేయిచేసుకున్నారు. హి మాయత్‌నగర్‌ ఆర్టీసీ క్రాస్రోడ్ వద్ద ఐకానిక్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు వైర‌ల్ గా మారాయి. దీంతో మంత్రి తీరుపై ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌గా, ప్ర‌జ‌లు మంత్రి పై మండిప‌డుతున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకుడు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం (ఆగస్టు 19న‌) ఒక వ్యక్తిని బహిరంగంగా చేయి చేసుకోవ‌డం,  చెంపదెబ్బ కొట్టడానికి ప్ర‌య‌త్నించ‌డం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ప్ర‌స్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ.. వైర‌ల్ గా మారింది. హిమాయత్‌నగర్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఐకానిక్‌ స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స‌మ‌యంలో అక్క‌డే బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) కూడా ఉన్నారు.

మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కాలర్ పట్టుకుని లాగిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన నెటిజన్ల నుంచి ఆగ్రహానికి గురైంది. తలసాని చెంపదెబ్బ కొట్ట‌డానికి చేయి ఎత్తినంత వ‌ర‌కు ఆ వీడియో దృశ్యాల్లో క‌నిపించింది. ఈ ఘ‌ట‌న‌తో మంత్రిపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. మద్యం తాగిన రాజకీయ నాయకులు ఏం చేయగలరో చెప్పడానికి ఇదో ఉదాహరణ అంటూ మంత్రి తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రిపై బీఆర్ఎస్ అగ్ర‌నాయ‌క‌త్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు సైతం మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంద‌రూ చూస్తుండ‌గానే ఒక వ్యక్తిపై చేయిచేసుకున్న మంత్రి తీరుపై మండిప‌డుతూ విమ‌ర్శ‌లు గుప్పించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ చాలా అసభ్యంగా వాతావరణాన్ని సృష్టించార‌నీ, ఒక వ్య‌క్తి మంత్రి కేటీఆర్ దగ్గరగా ముందు వరుసలో వెళ్తున్నందున అతన్ని గట్టిగా లాగి కొట్టాడంటూ పేర్కొంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios