హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో నాలాలో పడి చిన్నారి సుమేధ ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఘటనకు పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆయన అన్నారు.

చిన్నారి కుటుంబం పట్ల ప్రభుత్వానికి సానుభూతి ఉందని చెప్పారు తలసాని. ఘటనపై చిన్నారి సుమేధ కుటుంబానికి మంత్రి క్షమాపణలు తెలిపారు. 

అంతకుముందు తమ కూతురు నాలాలో పడి మరణించిన ఘటనపై సుమేధ తల్లిదండ్రులు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి కేటీఆర్ మీద వారు నేరేడుమెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also Read:నాలాలో పడి సుమేధ మృతి: కేటీఆర్ మీద పోలీసులకు ఫిర్యాదు

కేటీఆర్ మీదనే కాకుండా జీహెచ్ఎంసి కమిషర్, జోనల్ కమిషనర్ మీద కూడా వారు ఫిర్యాదు చేశారు. దాంతో పాటు స్థానిక కార్పోరేటర్ మీద, సంబంధిత డీఈ, ఏఈల మీద కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వారందరిపై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని వారు కోరారు. నేరేడ్ మెట్ లో అదృశ్యమైన 12 ఏళ్ల బాలిక సుమేధ బండ చెరువు వద్ద శవమై తేలింది. నాలాలా పడి ఆమె మరణించిన సంగతి తెలిసిందే.