జింఖానా గ్రౌండ్స్ లో తొక్కిసలాటపై తెలంగాణ సర్కార్ సీరియస్: వివరణ ఇవ్వాలని హెచ్ సీఏకు ఆదేశం

జింఖానా గ్రౌండ్స్  లో చోటు చేసుకున్న పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ విషయమై వివరణ ఇవ్వాలని తెలంగాణ స్పోర్ట్స్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఈ నెల 25న జరిగే క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల విక్రయంపై సమాచారంతో రావాలని ఆయన కోరారు. 

Telangana Minister Srinivas Goud Orders HCA To Explanation of Stampede At Gymkhana Ground

హైదరాబాద్: జింఖానా గ్రౌండ్స్ లో చోటు చేసుకున్న ఘటనపై  తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది.  ఈ విషయమై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం హెచ్ సీఏ ను ఆదేశించింది. క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయంపై సమాచారంతో రావాలని ఆదేశించింది. 

ఈ నెల 25వ తేదీన హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో  ఇండియా, అస్ట్రేలియా మధ్య క్రికెట్ మ్యాచ్ ఉంది.ఈ మ్యాచ్ కు సంబంధించి ఇవాళ టికెట్లను ఆఫ్ లైన్ లో విక్రయించనున్నట్టుగా  హెచ్ సీఏ ప్రకటించింది. టికెట్ల కోసం పెద్ద ఎత్తున  క్రికెట్ అభిమానులు వచ్చారు. నిన్న రాత్రి నుండే జింఖానా గ్రౌండ్స్ వద్ద నుండి క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు.  గేటు వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు తోసుకు వచ్చారు. దీంతో  తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఓ మహిళ మరనించిందని తొలుత ప్రచారం సాగింది. కానీ  ఈ ప్రచారంలో వాస్తవం లేదని పోలీసులు ప్రకటించారు. 

also read:జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి: వాస్తవం లేదన్న పోలీసులు

ఈ ఘటనపై తెలంగాణ స్పోర్ట్స్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపుపై వివరణ ఇవ్వాలని  హెచ్ సీ ఏ ను ఆదేశించారు. మ్యాచ్ టికెట్ల వివరాలతో రావాలని హెచ్ సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ సహ రావాలని ఆదేశించారు. టికెట్ల అమ్మకాల విషయంలో పారదర్శకంగా ఉండాలని కూడా మంత్రి అభిప్రాయపడ్డారు. ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కుదరదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేనట్టు వ్యవహరిస్తే సరికాదన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios