తెలంగాణ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (satyavathi rathod) ఇంట్లో విషాదం చోటుచేసకుంది. మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ ( lingya naik) కన్నుమూశారు.
తెలంగాణ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (satyavathi rathod) ఇంట్లో విషాదం చోటుచేసకుంది. మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ ( lingya naik) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. ప్రస్తుతం సత్యవతి రాథోడ్ మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతర పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే ఆమె హుటాహుటిన పెద్దతండాకు బయలుదేరారు.
మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ మరణవార్త తెలుసకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను ఫోన్‌లో పరామర్శించారు. మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక, మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి మృతి పట్ల మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులు సంతాపం తెలిపారు.
