Asianet News TeluguAsianet News Telugu

ప్రియాంక హంతకులను ఎన్‌కౌంటర్ చేయండి: మంత్రి సత్యవతిని అడ్డుకున్న స్థానికులు

కామాంధుల చేతుల్లో బలైపోయిన ప్రియాంక రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌ను స్థానికులు, మహిళా సంఘాలు అడ్డుకున్నాయి

telangana minister satyavathi rathod blackouted by people at Dr priyanka reddy residence
Author
Hyderabad, First Published Nov 29, 2019, 6:52 PM IST

కామాంధుల చేతుల్లో బలైపోయిన ప్రియాంక రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్‌ను స్థానికులు, మహిళా సంఘాలు అడ్డుకున్నాయి.

ప్రియాంక మిస్సింగ్‌పై ఆమె తల్లీదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై సకాలంలో స్పందించని పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ వారు మంత్రిని నిలదీశారు. అలాగే ప్రియాంకపై అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హతమార్చిన నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేయాలని స్థానికులు సత్యవతిని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read:ఇంకెంతమంది ప్రియాంకలు బలవ్వాలి: ఆడపిల్లను కాపాడుకోలేమా, తల్లిదండ్రుల కన్నీటి ఆవేదన

ప్రియాంకను చంపిన పాషా గ్యాంగ్ ఒడిశా నుంచి ఇటీవలే హైదరాబాద్‌లో లోడు వేసేందుకు హైదరాబాద్ వచ్చింది. బుధవారం రాత్రి 10 తర్వాత లారీతో పాటు హైదరాబాద్‌కు రావాలని యజమాని చెప్పడంతో పాషా అతని గ్యాంగ్ పీకల్లోతు మద్యం సేవించారు.

యజమాని దగ్గరకు వెళ్లేందుకు సమయం ఉండటంతో పాషా లారీని శంషాబాద్ టోల్‌గేట్ వద్ద పార్క్ చేశాడు. సరిగ్గా అదే సమయంలో ప్రియాంక రెడ్డి తన స్కూటీని పార్క్ చేసేందుకు అక్కడికి వచ్చింది. అప్పుడే ఆమెపై కన్ను వేసిన నిందితులు... లైంగిక దాడికి ప్లాన్ చేశారు.

ఇందుకోసం టోల్‌ప్లాజా వద్దే మాటు వేసి... ప్రియాంక స్కూటీని పంక్చర్ చేసింది. అనంతరం ఆమె వచ్చే వరకు నిందితులు మద్యం సేవించారు. ఆమె రాగానే పథకం ప్రకారం పాషా బైక్ పంక్చర్ అయ్యిందని.. దానిని బాగు చేయిస్తామని పది నిమిషాల పాటు వారు దుండగులు డ్రామా ఆడారు.

బండి పంక్చర్ వేయించినట్లు బైక్‌ను తీసుకొచ్చిన నిందితులు ఆమెకు అప్పగించారు. ప్రియాంక బయల్దేరే లోపు ఆమెను కిడ్నాప్ చేసిన పాషా.. పక్కనేవున్న నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లాడు. అనంతరం ప్రియాంక రెడ్డిపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమె నోరుమూసి ఊపిరాడకుండా చేసి చంపేశారు.

Also Read:ప్రియాంక రెడ్డి కేసు: స్కూటీ పార్క్ చేయడం చూసి...కాటు వేయడానికి పక్కాగా ప్లాన్

మృతదేహాన్ని అక్కడే వదిలేస్తే పోలీసులకు దొరికిపోతామని భావించిన నిందితులు... మృతదేహాన్ని మాయం చేయాలని భావించారు. ప్రియాంక రెడ్డి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టిన పాషా లారీలోకి ఎక్కించి, అక్కడికి దగ్గరలోని చటాన్‌పల్లి అండర్‌పాస్ వద్ద మిత్రులతో కలిసి మృతదేహాన్ని తగులబెట్టాడు. అత్యాచారం, హత్య అనంతరం నలుగురు నిందితులు ఎవరి ఇళ్లకు వారిపోయారు. లారీ నెంబర్ ద్వారా పోలీసులు నిందితులను గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios