రేపే తెలంగాణ టెన్త్ పరీక్ష ఫలితాలు: రిజల్ట్స్ కోసం ఇలా చేయండి..
తెలంగాణ టెన్త్ పరీక్ష ఫలితాలు రేపు విడుదలకానున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ పరీక్ష పలితాలను విడుదల చేస్తారు.
హైదరాబాద్: తెలంగాణ టెన్త్ పరీక్ష ఫలితాలు ఈ నెల 10వ తేదీన విడుదల కానున్నాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 3 నుండి 13వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించారు. టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం విద్యార్ధులను ఆందోళనకు గురి చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెలుగు ప్రశ్నాపత్రం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హిందీ పేపర్ లీకైందనే ప్రచారం రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. హిందీ ప్రశ్నాపత్రం లీక్ కుట్ర కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై వరంగల్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
also read:రేపే తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు: రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా..
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 7 లక్షల 39 వేల 493 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. ఈ దఫా టెన్త్ లో ఆరు ప్రశ్నాపత్రాలే. దీంతో టెన్త్ క్లాస్ పేపర్ల వాల్యూయేషన్ త్వరగానే పూర్తి చేశారు. అయితే రాష్ట్రంలో టీఎస్‌పీఎస్ సీ పేపర్ లీక్ వంటి ఘటనలు వెలుగులోకి రావడంతో టెన్త్ క్లాస్ పేపర్ల వాల్యూయేషన్ ను జాగ్రత్తగా నిర్వహించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఇంటర్ పరీక్ష ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయన్నారు. రేపు టెన్త్ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారు. తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్ష ఫలితాల కోసం https://bse.telangana.gov.in చూడాలని అధికారులు కోరారు.