Asianet News TeluguAsianet News Telugu

జగన్ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీలోని (ap govt) జగన్ ప్రభుత్వంపై (ys jagan mohan reddy) తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి (prasanth reddy)  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా సీఎం జగన్ నిధులు లేక కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే.. బిచ్చం ఎత్తుకుంటున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు.

telangana minister prashanth reddy sensational comments on ys jagan govt in ap
Author
Nizamabad, First Published Nov 12, 2021, 3:06 PM IST

ఏపీలోని (ap govt) జగన్ ప్రభుత్వంపై (ys jagan mohan reddy) తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి (prasanth reddy)  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లకు (paddy) సంబంధించి టీఆర్ఎస్ (trs) శ్రేణులు రైతు ధర్నాలు  చేస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్‌లో శుక్రవారం జరిగిన రైతు ధర్నాలో పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రా సీఎం జగన్ నిధులు లేక కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే.. బిచ్చం ఎత్తుకుంటున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నడవాలంటే కేంద్రం నిధులు (central funds) కావాలని.. కేంద్రం ఒత్తిడితో ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారని మంత్రి చెప్పారు. దేశంలోని రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని ఆయన తేల్చిచెప్పారు. కేంద్రం రైతులకు చేస్తున్న మోసంపై బీజేపీ నేతలను అడుగడుగునా అడ్డుకోవాలని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 

Also Read;TRS Dharna: ఢిల్లీ పెద్దల్లారా... అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా..: మంత్రి హరీష్ ఆగ్రహం

తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ(శుక్రవారం) రాష్టవ్యాప్త ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. పంజాబ్ రైతుల నుండి మొత్తం ధాన్యాన్ని ఎలాగయితే కేంద్రం కొనుగోలు చేస్తుందో తెలంగాణ రైతుల నుండి కూడా అలాగే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కోరుతోంది. కేంద్రం తెలంగాణ రైతులపై వివక్ష ప్రదర్శిస్తోందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో siddipet నియోజకవర్గ కేంద్రంలో రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలో మంత్రి హరిష్ రావు పాల్గొన్నారు. ఈ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు భారీ సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డ్స్ ప్రదర్శినతో పాటు నినాదాలతో ధర్నా ప్రాంగణం హోరెత్తింది.  

ఈ సందర్భంగా minister harish rao మాట్లాడుతూ... తెలంగాణ కు ఒక న్యాయం ... పంజాబ్ కు ఒక న్యాయమా...? అంటూ కేంద్రాన్ని నిలదీసారు. తెలంగాణ భారతదేశంలో భాగం కాదా...? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన వరి ధ్యాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనదని అడిగారు. తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే FCI ద్వారా కొనుగోలు చేయాలని హరీష్ డిమాండ్ చేసారు. ''Bjp అంటేనే భారతీయ ఝూటా పార్టీ. ఢిల్లీ పెద్దల్లారా... అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా! వరి ధాన్యం కొనకుండా వంచిస్తారా..? పైకి దేశ భక్తి ప్రదర్శిస్తూ లోపల కార్పోరేట్ భక్తి కలిగివుంటారా. బిజెపి నేతల్లారా... ఇదేనా మీ ద్వంద్వ నీతి. రైతులను వంచించడమే దేశ భక్తా... సిగ్గు..సిగ్గు!! వెంటనే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి'' అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios