రాజ్ భవన్ కు మంత్రి ప్రశాంత్ రెడ్డి: బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ కు ఆహ్వానం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గురించి  గవర్నర్ తో  మంత్రి ప్రశాంత్ రెడ్డి,  అధికారులు  ఇవాళ చర్చించారు. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను  మంత్రి ఆహ్వానించారు.  

Telangana Minister Prashanth Reddy Invites governor Tamilisai soundararajan for Assembly Budget sessions


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను  రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. సోమవారం నాడు రాత్రి  రాజ్ భవన్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,   ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు తదితరులు గవర్నర్ ను కలిశారు.  

వచ్చే నెలలో  బడ్జెట్ సమావేశాలు  ప్రారంభం కానున్నాయి. అయితే  గత ఏడాది మాదిరిగానే  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం  ఉంటుందా ఉండదా అనే  చర్చ సాగుతుంది. అసెంబ్లీని ప్రోరోగ్ చేయనందున ఈ దఫా కూడ  గవర్నర్  ప్రసంగం  లేకుండానే  బడ్జెట్ సమావేశాలు  ప్రారంభమయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. 

బడ్జెట్  కు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది.  అయితే  బడ్జెట్ కు ఆమోదం తెలపకపోవడంపై  హైకోర్టులో  తెలంగాణ ప్రభుత్వం ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు  చేసింది.  ఈ పిటిషన్ పై విచారణ సమయంలో  కోర్టు సూచనతో  ఇరు వర్గాల న్యాయవాదులు  సమావేశమై  రాజ్ భవన్, ప్రభుత్వం మధ్య  సయోధ్య కుదిరేలా  చర్చలు జరిపారు. 

రాజ్యాంగం ప్రకారంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది,. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం  ఉంటుందని ప్రభుత్వ తరపు న్యాయవాది  హైకోర్టుకు తెలిపారు. గవర్నర్ పై మంత్రులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు చేసిన విమర్శలను గవర్నర్ తరపు న్యాయవాది గుర్తు చేశారు. గవర్నర్ పై విమర్శలు  చేయకూడదని చెబుతామని ప్రభుత్వ తరపు న్యాయవాది దుశ్యంత్ ధవే చెప్పారు.   అంతేకాదు లంచ్ మోషన్ పిటిషన్ ను కూడా   ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. 

also read:దిగొచ్చిన కేసీఆర్ సర్కార్: బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం, లంచ్ మోషన్ పిటిషన్ ఉపసంహరణ

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి  ప్రభుత్వం కసరత్తు నిర్వహించింది.  పుదుచ్చేరి నుండి హైద్రాబాద్ కు గవర్నర్  తమిళిసై సౌందర రాజన్ తిరిగి రాగానే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  నేతృత్వంలోని బృందం రాజ్ భవన్  కు వెళ్లింది. బడ్జెట్ సమావేశాల్లో  ప్రసంగించాలని గవర్నర్ ను ఆహ్వానించారు.  

గత కొంతకాలంగా  ప్రభుత్వానికి గవర్నర్ మధ్య  అగాధం నెలకొని ఉంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ తప్పు బడుతున్నారు.  మీడియా సమావేశం ఏర్పాటు  చేసి గవర్నర్  ప్రభుత్వంపై  విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై  కేంద్రానికి కూడా నివేదికలు పంపారు.   గవర్నర్ తీరుపై మంత్రులు కూడా విమర్శలు  చేశారు.  బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కూడా  గవర్నర్ ను

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios