Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ ది బస్సు యాత్ర కాదు.. తుస్సు యాత్ర

  • బస్సు యాత్ర తుస్సుమన్నది
  • మీ బతుకులు అంతే
  • రెండంకెల సంఖ్యలో కూడా మీరు గెలవలేరు
telangana minister pocharam fire on congress bus yatra

కాంగ్రేస్ నాయకుల బస్ యాత్ర తుస్ యాత్ర.  కాంగ్రేస్ నాయకుల మద్య ఐకమత్యం లేదు, వారికి ప్రజల నుండి స్పందన లేదు. కాంగ్రేస్ కార్యకర్తలు వచ్చారు తప్ప, సామాన్య ప్రజలకు మీ బస్ యాత్ర పట్ల గౌరవం, మర్యాద లేదు. ఒక్క బస్ యాత్రనే కాదు మనిషికో బస్ వేసుకోని తిరిగినా మీ బతుకు అంతే. ప్రస్తుతం ఉన్న రెండంకెల స్థానాలు కూడా గెలవరని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి విమర్శించారు.
 
ఈరోజు నిజామాబాద్ లో మీడియా సమావేశంలో మంత్రి పొచారం మాట్లాడుతూ కెసిఆర్ మూడున్నర ఏళ్ళలోనే ఇన్ని పథకాలు, కార్యక్రమాలు చెస్తే 70 ఏళ్ళ మీ పాలనలో ఏంచేశారు ?. మీ హయంలో ఏమి చేశారు ? . పంటలను ఎండగొట్టి రైతుల గొస పోసుకున్నారు. ఈరోజు TRS పార్టీ చేస్తున్న మంచి పనులను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని తమకు డిపాజిట్ లు రావనే భయంతో చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో TRS ఖచ్చితంగా 100 నుండి 106 స్థానాలలో గెలుస్తుంది. ఇది ప్రజల నాడి. గ్రామాలకు గ్రామాలే TRS కు మద్దతు తెలపుతున్నాయి. పాపం కుంతియాను స్టేజి మీద నుండి పడవేసారు. మీ యాత్రంతా బస్సు, తుస్సు, కస్సు. మీ పరిపాలన బాగుండి ఉంటే ఏమైనా ప్రజలు నమ్మేవారు. మీ కాళ్ళ కింద భూమి కదులుతుంది. ఈ యాత్రలన్నీ రాజకీయ పబ్బం కోసమే తప్ప మరోకటి కాదని మంత్రి పొచారం విమర్శించారు.
 
దేశంలో ప్రజలు కాంగ్రేస్ పరిపాలనను, ప్రత్యామ్నాయమైన బిజేపి పరిపాలనను చూసారు. నేడు రాష్ట్రంలో ఉద్యమ నాయకుడైన కెసిఆర్ పరిపాలనను చూస్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ పరిపాలనను అందిస్తున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్. అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి పరిపాలన బాగుందని కితాబు ఇస్తున్నారు. ప్రజలకు ఏది ఆమోదయోగ్యమో, ప్రజలకు అవసరమైన పథకాలనే అమలు చేస్తున్నారు. ఇటివల వ్యవసాయ సదస్సు కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు అన్ని రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ పరిపాలన దేశానికే ఆదర్శమని మెచ్చుకున్నారు, ఇది మనందరికి గర్వకారణం. కొడితే, తిడీతే ప్రజలు రారు, తమకు ఇష్టమైన నాయకుడు వచ్చినప్పుడు ప్రజలు స్వచ్చందంగా ముందుకు వస్తారు.

 
కేంద్రంలో కాంగ్రేస్ కు ప్రత్యామ్నాయం బిజేపి . రైతుల ఆధాయం రెట్టింపు చేస్తాం అని ప్రధానమంత్రి చెబుతున్నారు, కాని మార్గాలు ఎలా అంటే సమాధానం లేదు. పంటలకు కనీస మద్దతు ధర పెంచరు. నేడు కేవలం 14 పంటలకే కనీస మద్దతు ధర ఉంది. వాణిజ్య పంటలకు మద్దతు ధర లేదు. ఎరువులకు సబ్సిడి తీసివేశారు. రైతుల ఆధాయం రెట్టింపు కావాలనే సంకల్పం మంచిదే అయినా కేంద్రం స్పష్టమైన నిర్ణయాలతో ముందుకు రావడం లేదు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన లో అనేక లోపాలున్నాయి. గ్రామం యూనిట్ గా ఉండటంతో వ్యక్తిగతంగా నష్టపోయిన రైతులకు ఎలాంటి సహాయం అందడం లేదు. గ్రామీణ ఉపాది హామి పథకాన్ని వ్యవసాయంతో అనుసందానం చేయమని రాష్ట్రం తీర్మానం చేసి పంపితే కేంద్రం పట్టించుకోవడం లేదు.
 
దేశంలో అనేక నదులున్నాయి. దేశంలో సాగు యోగ్యమైన భూమి 40 కోట్ల ఎకరాలు ఉంది. ఇందులో 60 శాతం కన్నా ఎక్కువ భూమి వర్షాధారం. 20 శాతం బోర్లు, బావులు, 20 శాతం ప్రాజెక్టుల మీద ఆధారపడి ఉంది. దేశంలో ఏటా 70,000 TMC నీరు అందుబాటులో ఉంటే అందులో కేవలం 25,000 TMC లు మాత్రమే వినియోగించుకుంటున్నాం. మిగితా 45,000 వృధాగా సముద్రం పాలవుతుంది. ఈ మొత్తం నీటిని ఉపయోగించుకోగలిగితే 25 కోట్ల ఎకరాలకు నీటిని అందించవచ్చు, కరువును దూరం చేసి రైతుల ఆత్మగౌరవం పెంచవచ్చు. కేంద్రం ఆ పని చేయదు.
 
ముఖ్యమంత్రి అయిన వారం రోజుల్లోనే కెసిఆర్ హెలికాఫ్టర్ లో తిరిగి నీటి నిల్వల ఆధారంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి ఇలా కష్టపడలేదు. గోదావరిలో ఏటా 1600 ల TMC నీరు వృధాగా పోతుంది. కాళేశ్వరం, సీతారామా ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా నీటిని తీసుకువచ్చి తెలంగాణ గడ్డను సస్యశ్యామలం చేసి కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి ముమ్మరంగా పనులను జరిపిస్తున్నారు.  
 
కేంద్రంలో 70 ఏళ్ళు, రాష్ట్రంలో గత 10 ఏళ్ళు మీ కాంగ్రేస్ పార్టీనే అధికారంలో ఉంది, మీరే పరిపాలనలో ఉన్నారు. మరి మీరేం చేసారు. అదే ఇంజనీర్లు ఉన్నారు, కాని మీకు ప్రాజెక్టులు కట్టి నీరివ్వాలని గుర్తుకు రాలేదు. మీకు ఎన్నికల సమయంలో మాత్రమే  ఓటర్లు గుర్తుకు వస్తారు తప్ప, ఎన్నికల అనంతరం ప్రజలు గుర్తుకు రారు. దేశ రాజకీయాలలో ప్రజలు సమర్ధవంతమైన నాయకున్ని కోరుకుంటున్నారు. దేశంలో 70 శాతం రైతులే ఉన్నారు. తెలంగాణ రైతులకు 24 గంటల విద్యుత్తు, పుష్కలంగా విత్తనాలు, ఎరువులు, పెట్టుబడికై ఎకరాకు రూ. 8,000, రూ. 5 లక్షల భీమా అందిస్తున్నాం. రాష్ట్రంలో, దేశంలో రైతు ఆత్మహత్యలకు కారణం గత కాంగ్రేస్ పార్టీ పాలననే. నేడు TRS  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది. రైతులకు విశ్వాసం కలిగింది. రైతులు దైర్యంగా ఉన్నారు. మీ హయంలో ఆత్మస్థైర్దం కోసం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్యలు లేని తెలంగాణనే ముఖ్యమంత్రి గారి లక్ష్యం.
 
జూన్ 2 ప్రమాణ స్వీకారం తర్వాత 40 వేల కోట్లతో 36 రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. 70 శాతం ఉన్న రైతులకు ప్రాముఖ్యత ఇస్తాం అన్నారు, అదేవిదంగా అమలుచేస్తున్నాం. ముఖ్యమంత్రి రైతు పక్షపాతి.

బిజేపి నాయకులను అడుగుతున్నా గత నాలుగేళ్ళలో ప్రజలకు ఉపయోగపడే పథకం ఏదైనా ప్రకటించారా. రైతుల కోసం ఏమైనా చెశారా అంటే అదీ లేదు. పనికిరాని ఫసల్ బీమా యోజన తెచ్చారు. కేంద్రంలో ప్రజామోదమైన పరిపాలన లేదు. ప్రజల కష్టాలు, బాధలు తెలిసిన నాయకుడు కెసిఆర్. దేశ ప్రజలు తమకు అటువంటి నాయకుడు కావాలని కోరుకుంటే తప్పులేదు. ప్రస్తుత పరిస్థితులలో UPA, NDA కు ప్రత్యామ్నాయం రావాల్సిందే. ఇద్దరి పాలనను ప్రజలు చూశారు. థర్డ్ ఫ్రంట్ అనేది దేశ రాజకీయాలలో ఒక కొత్త పాత్ర పోషించి, ప్రజల అవసరాలను, భవిష్యత్తును తీర్చిదిద్దే విదంగా పరిపాలన కొనసాగాలనే సంకల్పంతో ముందుకు వస్తుందన్నారు.  

ఈసమావేశంలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా పరిషత్ చైర్మన్ ధఫేదార్ రాజు, జిల్లాTRS కన్వీనర్ ఈగ గంగారెడ్డి పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios