హైదరాబాద్: తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. మంత్రి పైలట్ వాహనం బోల్తా పడింది. కొత్తపల్లి ఎస్సై ఎల్లా గౌడ్ చేయి విరిగింది. ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఆయనను హైదరాబాదులోని ఆస్పత్రికి తరలించారు. 

కరీంనగర్ జిల్లా పర్యటనను ముగించుకుని వస్తుండగా ఆ ప్రమాదం జరిగింది. వివరాలు అందాల్సి ఉంది.