Asianet News TeluguAsianet News Telugu

డబ్బు కోసం కేటుగాళ్ల స్కెచ్, ఏకంగా మంత్రి పేరుతో మెసేజ్‌లు.. స్పందించొద్దన్న నిరంజన్ రెడ్డి

తన పేరుతో వాట్సాప్‌లో వస్తున్న మెసేజ్‌లపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఆ మెసేజ్‌లకు ఎవ్వరూ స్పందించొద్దని, చట్టపరంగా నేరస్తులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

telangana minister niranjan reddy responds on fake whatsapp messages
Author
First Published Dec 7, 2022, 7:54 PM IST

ప్రముఖులు, సెలబ్రెటీల పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచి దబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్‌లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేరారు. నకిలీ నెంబర్లు, డీపీలతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. 9353849489 నెంబర్ నుంచి సందేశాలు వస్తున్నాయి. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆ నెంబర్‌కు డబ్బులు పంపొద్దని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. సైబర్ నేరగాళ్లపై చట్టపరంగా చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios