ఏ పార్టీలో ఎవరు అభ్యర్థో డిసైడ్ చేసేది నేనే: మంత్రి మల్లారెడ్డి ఆసక్తికరం

మంత్రి మల్లారెడ్డి  ఆసక్తికర వ్యాఖ్యలు  చేశారు.  మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుండి ఎవరు బరిలో ఉండాలనేది దానే డిసైడ్ చేయనున్నట్టుగా  చెప్పారు.

Telangana Minister Malla Reddy interesting Comments  on  medchal Assembly Segment politics lns

హైదరాబాద్:  మేడ్చల్  అసెంబ్లీ స్థానం నుండి ఏ పార్టీ నుండి ఎవరు ఉండాలో తానే డిసైడ్ చేస్తానని  మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు  చేశారు.గురువారంనాడు తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో  మంత్రి మల్లారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.  గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ  కేఎల్ఆర్ కు  తానే టిక్కెట్టు ఇప్పించినట్టుగా  మల్లారెడ్డి  చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో తనకు  మిత్రులున్నారన్నారు.  మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో  గొడవలకు తామే కారణమని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తొడకొట్టిన తర్వాత  తన గ్రాఫ్ పెరిగిందని  ఆయన  చెప్పారు. మంత్రివర్గవిస్తరణ  అంటే తన పదవి పోతుందనే  ప్రచారం జరిగిన విషయాన్ని ఆయన మీడియా ప్రతినిధుల వద్ద ప్రస్తావించారు. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తనపై మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన  ఆగ్రహం వ్యక్తం  చేశారు.  మీడియాపై  తాను  సినిమాలు తీస్తానన్నారు.  

2014లో మల్లారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.  మల్కాజిరిగి  పార్లమెంట్ స్థానం నుండి  టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించారు.  2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు  మల్లారెడ్డి  టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.  2018 ఎన్నికల్లో మల్లారెడ్డి  మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ మంత్రివర్గంలో  మల్లారెడ్డికి చోటు  దక్కింది.  

నిత్యం ఏదో  ఒక  కామెంట్ చేస్తూ  మీడియాలో  చోటు దక్కించుకుంటారు మల్లారెడ్డి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని  నిర్ణయం తీసుకోవడం ఎన్నికల కోసమేనని మల్లారెడ్డి  నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తన మనసులోని మాటలను  నిర్మోహమాటంగా చెప్పే అలవాటు మల్లారెడ్డికి ఉంది.  బహిరంగసభలైనా సరే, మీడియా సమావేశాల్లోనైనా మల్లారెడ్డి  మాత్రం  ఏది మనసులో దాచుకోరు.  ఇవాళ అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చాట్  సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

also read:ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటే.. : మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

గతంలో మల్లారెడ్డితో పాటు ఆయన కొడుకులు, బంధువుల ఇళ్లపై  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ సోదాలకు సంబంధించి  అధికారుల విచారణకు  సహకరించినట్టుగా  మంత్రి మల్లారెడ్డి చెప్పారు.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios