Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటే.. : మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆర్టీసీ విలీనాన్ని ఎన్నికల స్టంట్ అని అంగీకరించారు. ఆర్టీసీ విలీనం చేసినందుకు సీఎం కేసీఆర్, మినిస్టర్ కేటీఆర్‌ల చిత్రపటాలకు హైదరాబాద్‌లోని పీర్జాదిగూడలో క్షీరాభిషేకం చేశారు. అనంతరం, ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంట్ అయితేనేం, కార్మికులకు న్యాయం జరిగిందా? లేదా? అని అన్నారు.
 

minister mallareddy accepts tsrtc merging with govt is election stunt kms
Author
First Published Aug 3, 2023, 5:12 AM IST

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ విషయం పై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల స్టంటే అని అన్నారు. ఎన్నికల స్టంటే అనుకోండి.. అయితే ఏంటీ ఆర్టీసీ ఉద్యోగులకు మేలు జరిగిందా? లేదా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ విలీనం చేసినందున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల చిత్రపటాలకు పీర్జాదిగూడ కార్పొరేషన్‌లో బుధవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని ఎన్నికల స్టంట్‌గా చూడాలా? అని ఓ విలేకరి మంత్రి మల్లారెడ్డిని అడిగారు. దీనికి సమాధానంగా.. ఎన్నికల స్టంట్ అంటావ్.. సరే.. ఏదైనా అనుకో.. అంటూ మల్లారెడ్డి అన్నారు. తమది రాజకీయ పార్టీ అని పేర్కొంటూ.. అలాంటప్పుడు ఎన్నికల స్టంట్ కూడా ఉంటది అని వివరించారు. నువ్వు చెప్పినట్టు ఎన్నికల స్టంటే అనుకో.. అయితేనేం.. ఆర్టీసీ కార్మికుల న్యాయం జరిగిందా? లేదా? అంటూ తిరిగి ప్రశ్నించారు. వాళ్లు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులైంద్రా లేదా? అది ఆలోచించాలే అని వివరించారు.

కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు మహా ఆందోళన చేపట్టారు. 2019లో సుమారు రెండు నెలలపాటు మహా ధర్నా చేశారు. బస్సులు రోడ్డెక్కలేవు. దాదాపు ప్రజా రవాణా నిలిచిపోయింది. అయినా కేసీఆర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. కార్మికుల డిమాండ్లను కొట్టిపారేశారు. ఈ భూగోళం ఉండగా ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపలేరని అన్నారు. 

Also Read: తెలంగాణలో మూడోసారి అధికారం మాదే: ఎల్ బీ నగర్ లో కేటీఆర్

వాస్తవానికి అప్పటి నుంచి ఇతర ఉద్యోగుల ధర్నాలు కూడా చాలా వరకు తగ్గాయి. బస్సులు రోడ్డెక్కకున్నా పట్టించుకోని కేసీఆర్ సర్కారు తీరుతో చాలా ఉద్యోగ సంఘాలు ఆందోళనలు వృధా ప్రయాస, కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల గోడు వినే ప్రభుత్వం కాదనే భావన వచ్చింది. 

అప్పటి నుంచి ఆర్టీసీ కార్మికుల్లో చాలా వరకు ప్రభుత్వంపై వ్యతిరేకత కొనసాగుతూ వస్తున్నది. ఎన్నికల వేళ సుమారు 50 వేల ఉద్యోగులు ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనే ప్రకటనతో ప్రభుత్వంపై వైపు తిప్పుకునే నిర్ణయాన్ని కేసీఆర్ ప్రకటించారు. ఈ నిర్ణయం కూడా లెక్కలు వేసుకునే తీసుకున్నారనే చర్చలు జరుగుతున్నాయి. రానున్న కాలంలో ఈ నిర్ణయంపై ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios