డబుల్ ఇంజన్ అంటే మోడీ, ఈడీ అని అర్ధమైంది: బండి సంజయ్ కి కేటీఆర్ కౌంటర్
డబుల్ ఇంజన్ అంటే నరేంద్ర మోడీ, ఈడీ అని అర్ధమైందని తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈడీ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని బండి సంజయ్ నిన్న వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.
హైదరాబాద్: దేశాన్ని నడిపే డబుల్ ఇంజన్ అంటే Narendra Modi, ఈడీ అని మాకు ఇప్పుడు అర్ధమైందని తెలంగాణ మంత్రి KTR సెటైర్లు వేశారు. తెలంగాణ సీఎం KCR కూడా Enforcement Directorate విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay నిన్న వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యల విషయమై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు.
బీజేపీ నేతలు తరచుగా చెప్పే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మోడీ, ఈడీ అని అర్ధమైందని కేటీఆర్ చెప్పారు. అంతేకాదు బండి సంజయ్ ను ఈడీకి కూడా చీఫ్ గా నియమించినందుకు ధన్యవాదాలు అంటూ మోడీని ఉద్దేశించి కేటీఆర్ సెటైర్లు వేశారు.
Telangana CM కేసీఆర్ కూడా ఈడీ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తా కథనాన్ని కూడా కేటీఆర్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బైక్ ర్యాలీలను ప్రారంభించింది. సిద్దిపేట జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈడీ విచారణకు రావాల్సిందేనన్నారు. అంతేకాదు సీబీఐ విచారణకు ఎదుర్కొంటారన్నారు. గతంలో కూడా కేసీఆర్ పై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా గతంలోనే స్పందించారు.
కేసీఆర్ పై తాను ఈడీ, సీబీఐ వంటి సంస్థలకు ఫిర్యాదు చేసిన విషయాలను కూడా రేవంత్ రెడ్డి మీడియా వేదికగా ప్రస్తావించారు. కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఈ చిట్టాను విప్పుతామని బీజేపీ నేతలు చెబుతుంటారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ సర్కార్ అవినీతికి సంబంధించి తాను ఆధారాలతో విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసినా కూడా ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించిన విసయం తెలిసిందే.
also read:కేసీఆర్ కూడా ఈడీ విచారణకు రావాల్సిన అవసరం ఉంది: బండి సంజయ్ సంచలనం
ఇదిలా ఉంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన తర్వాత పలు ప్రభుత్వ సంస్థలకు బండి సంజయ్ సమాచార హక్కు చట్టం ద్వారా ధరఖాస్తులు చేశారు. పలు అంశాలపై ప్రభుత్వ సంస్థల నుండి సమాచారం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలతో పాటు పలు అంశాలపై ప్రభుత్వంనుండి వచ్చే సమాచారం ఆధారంగా బీజేపీ సర్కార్ పోరాట కార్యక్రమాలను నిర్వహించనుంది. అదే సమయంలో కేసీఆర్ సర్కార్ ఏ రకంగా ప్రజలకు ఇచ్చిన హమీల్లో ఎన్ని హమీలు నెరవేర్చారు, ఎన్ని నెరవేర్చలేదో కూడా వివరించాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు.